Mulayam Singh Yadav Passed Away : యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్(82) కన్నుమూశారు. కొంతకాలంగా ములాయం సింగ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుర్ గావ్ మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు.

Mulayam Singh Yadav Passed Away : యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత

Mulayam Singh Yadav passed away

Updated On : October 10, 2022 / 10:26 AM IST

Mulayam Singh Yadav Passed Away : సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్(82) కన్నుమూశారు. కొంతకాలంగా ములాయం సింగ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుర్ గావ్ మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు.

ఆగస్టు 22న ములాయం ఆస్పత్రిలో చేరారు. వారం రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతి చెందారు. ములాయం సింగ్ ముడుసార్లు సీఎంగా పని చేశారు. కేంద్ర రక్షణ మంత్రిగానూ పని చేశారు.

Shivsena Symbol Row: నేడు సీఎం షిండే వర్గం వంతు .. మూడు పేర్లు, గుర్తులతో ఈసీకి జాబితాను సమర్పించిన ఉద్ధవ్ థాకరే వర్గం..

1939 నవంబర్ 22న ములాయ్ సింగ్ యాదవ్ జన్మించారు. ములాయ్ సింగ్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు. 1967లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయయ్యారు. 1977లో తొలిసారి ములాయం యూపీ మంత్రి అయ్యారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.