బీజేపీలోకి సాప్నా చౌదరి…ఎంపీగా పోటీ!

  • Published By: venkaiahnaidu ,Published On : April 30, 2019 / 10:17 AM IST
బీజేపీలోకి సాప్నా చౌదరి…ఎంపీగా పోటీ!

Updated On : May 28, 2020 / 3:40 PM IST

హర్యానాకు చెందిన పాపులర్ డ్యాన్సర్, యాక్టర్, సింగర్ సాప్నాచౌదరి బీజేపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. కొన్ని రోజుల క్రితం సాప్నా కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగింది. అయితే తాను ఏ పార్టీలో చేరడం లేదని ఆ సమయంలో సాప్నా తేల్చి చెప్పింది. ఇటీవల ఢిల్లీ బీజేపీ చీఫ్, నార్త్ ఈస్ట్ ఢిల్లీ బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీకి మద్దతుగా ఆమె రోడ్ షోలో పాల్గొన్నారు.

దీంతో ఆమె బీజేపీలో చేరి ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. ఈ సమయంలో సాప్నా బీజేపీలో చేరేందుకు అంతా సిద్దమైందని మనోజ్ తివారీ సోమవారం (ఏప్రిల్-29,2019)రాత్రి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాకుండా మంగళవారం ఆమె బీజేపీలో చేరుతుందని ఆయన ప్రకటించారు.

హిందీ బెల్ట్ లో సప్నా ఓ సెన్సేషన్. ఓ కల్చరల్ ఐకాన్. సప్నా పాపులారిటీ అంతా ఇంతా కాదు. అలాంటి సాప్నా తమ పార్టీలోకి వస్తే తమకు ఇక విజయం ఖాయమని పలు పార్టీలు భావిస్తుంటాయి. 2018లో గూగుల్ లో అత్యధికంగా నెటిజన్లు సెర్చ్ చేసినవారిలో సాప్నా ఒకరు.
Also Read : బీజేపీ రోడ్ షోలో సాప్నా చౌదరి