ఏడు తలల పాము ఉంది.. ఇదిగో సాక్ష్యం

ఏడు తలల పాము ఉంది.. ఇదిగో సాక్ష్యం

Updated On : October 10, 2019 / 8:36 AM IST

ఏడు తలల పాము గురించి పురాణాల్లో.. సినిమాల్లో.. విని ఉంటాం. నిజంగా ఊహించుకోవడానికే సాధ్యం కాని ఈ ఏడు తలల పాము బెంగళూరు సమీపంలో కనిపించిందట. బెంగళూరుకు 60కిలోమీటర్ల దూరంలో ఉన్న కనకపురలోని మరిగౌడన్న దొడ్డి గ్రామంలో బుధవారం ఉదయం ఈ వింత చోటు చేసుకుంది. 

అదే గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి ఆరు నెలల క్రితం ఇలాంటిదే ఏడు తలల పాము కుబుసం కనిపించిందని చెప్పాడు. బుధవారం ఉదయం గుడి సిబ్బంది బాలప్ప అనే వ్యక్తి పరిసరాలు శుభ్రం చేసే క్రమంలో గుడికి పది అడుగుల దూరంలో పాము కుబుసం ఉండటాన్ని గమనించాడు. 

ఇప్పటి వరకూ రెండు తలల పాములను చాలా సార్లు చూశాం కానీ, ఏడు తలల పాము గురించి సాక్ష్యం చూడటం ఇదే తొలిసారి అని గ్రామస్థులు చెప్తున్నారు. గతంలోనూ ఇలాగే ఓ సారి కనిపించడంతో ఈ ప్రదేశంలో గుడి కట్టించాలని గ్రామపెద్దలు నిర్ణయించుకున్నారు. 

7 తలల పాము కుబుసం కనిపించడంతో గ్రామస్థులంతా కుంకుమ, పసుపులతో పూజలు చేస్తున్నారు. పాముల్లో సహజంగా మూడు వారాల నుంచి 2నెలల మధ్య కాలంలో ఇలా కుబుసాన్ని విడుస్తాయి. ఇలా చేయడం వాటి ఎదుగుదలకు సహయపడుతుంది. ఈ ఏడు తలల పాము కుబుసం వీడియోను మీరు ఓ సారి చూడండి.