బిగ్ బ్రేకింగ్ : మహారాష్ట్ర గవర్నర్ ని కలిసిన ఆదిత్యఠాక్రే

మహారాష్ట్ర రాజకీయాలు గందరగోళంగా మారాయి. బీజేపీ-శివసేన మధ్య 50:50 ఫార్ములా విషయంలో మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలో కొద్దిసేపటి క్రితం శివసేన నాయకులు గవర్నర్ తో సమావేశమయ్యారు. శివసేన శాసనసభా పక్ష నేతగా ఇవాళ ఎన్నికైన ఏక్ నాథ్ షిండే,శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్యఠాక్రే,పలువురు శివసేన నాయకులు కొద్దిసేపటి క్రితం రాజ్ భవన్ కు చేరుకుని గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీతో సమావేశమవడం చర్చనీయాంశంగా మారింది. శివసేన విడిగా గవర్నర్ ని కలవడం ఈ వారంలో ఇది రెండోసారి.
చెరో రెండున్నసంవత్సరాల పాటు సీఎం సీటుని పంచుకోవాలని శివసేన చేస్తున్న ప్రతిపాదనను బీజేపీ ఒప్పుకోవడం లేదు. 5ఏళ్లు తానే సీఎం అని దేవేంద్ర ఫడ్నవీస్ బహిరంగ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. శివసేనకు 16మంత్రి పదవులు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ చెబుతోంది. అయితే ఈ ప్రతిపాదనకు శివసేన అంగీకరించడం లేదు. ఈ సమయంలో శివసేన గవర్నర్ ని కలవడం మహా రాజకీయాల్లో ఆశక్తి రేపుతోంది.
బీజేపీ తమ డిమాండ్ లకు ఒప్పుకోకుంటే ఎన్సీపీ తమకు మద్దతిచ్చేందుకు రెడీగా ఉందంటూ శివసేన బీజేపీని పరోక్షంగా హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటిమికి ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత మెజార్టీ వచ్చినప్పటికీ పదవుల విషయంలో క్లారిటీ లేక ఇప్పటివరకు కొత్త ప్రభుత్వం కొలువుదీరలేదు.
umbai: Shiv Sena delegation including Aditya Thackeray, Ramdas Kadam, Eknath Shinde meets Governor Bhagat Singh Koshyari at the Raj Bhavan. pic.twitter.com/6OS4HQkiH1
— ANI (@ANI) October 31, 2019