Nitin Gadkari: గడ్కరీ వ్యాఖ్యలపై స్పందించిన శివసేన.. బీజేపీలో ఆయన ఎదగకుండా కుట్ర జరిగిందని ఆరోపణ..

అధికారం కోసమే రాజకీయాలు అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయని, కొన్నిసార్లు తనకు రాజకీయాలను వదిలేసి వెళ్లాలనిపిస్తోందంటూ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీ రెండు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. గడ్కరీ వ్యాఖ్యలకు శివసేన స్పందించింది.

Nitin Gadkari: గడ్కరీ వ్యాఖ్యలపై స్పందించిన శివసేన.. బీజేపీలో ఆయన ఎదగకుండా కుట్ర జరిగిందని ఆరోపణ..

Nitin Gadkari

Updated On : July 26, 2022 / 5:05 PM IST

Nitin Gadkari: అధికారం కోసమే రాజకీయాలు అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయని, కొన్నిసార్లు తనకు రాజకీయాలను వదిలేసి వెళ్లాలనిపిస్తోందంటూ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీ రెండు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారమే లక్ష్యం అన్నట్లు బీజేపీ రాజకీయాలు చేస్తుందని ప్రతిపక్షాలు విమర్శల దాడిచేస్తున్న క్రమంలో గడ్కరీ వ్యాఖ్యలు బీజేపీలో కలకలం సృష్టించాయి.

Minister Nitin Gadkari: ఇలాంటి రాజకీయాల్లో ఉండాలనిపించడం లేదు.. గడ్కరీ సంచలన వ్యాఖ్యలు

తాజాగా గడ్కరీ వ్యాఖ్యలపై శివసేన పార్టీ స్పందించింది. ఆ పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో బీజేపీపై విమర్శలు చేస్తూ గడ్కరీపై పార్టీలో కుట్ర జరిగిందని రాయడం గమనార్హం. గడ్కరీ రెండవ సారి జాతీయ అధ్యక్షుడు కాకుండా కుట్ర చేశారని ఆరోపించింది. గడ్కరీ ప్రతిష్టకు భంగం కలిగించడం కోసం ఆయన సంస్థలపై దాడులు చేయడానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ను వాడుకున్నారని శివసేన తన పత్రికలో పేర్కొంది. గడ్కరీ రెండోసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయ్యి ఉంటే దేశ రాజకీయ చరిత్ర పూర్తిగా మారిపోయి ఉండేదని సామ్నా పేర్కొంది.

Minister Nitin Gadkari: ఇలాంటి రాజకీయాల్లో ఉండాలనిపించడం లేదు.. గడ్కరీ సంచలన వ్యాఖ్యలు

మరోవైపు గడ్కరీ వ్యాఖ్యలపై పలువురు బీజేపీయేతర పార్టీల నేతలు స్పందించారు. గడ్కరీ వ్యాఖ్యలు ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న పాలనకు అద్దం పట్టేలా ఉన్నాయంటూ పేర్కొనడం గమనార్హం.