Liquor Bandh: మందుబాబులకు షాక్..! లిక్కర్ బంద్..! మహారాష్ట్రవ్యాప్తంగా 20వేల బార్లు మూసివేత.. ఎందుకంటే..
నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI), హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ (వెస్ట్రన్ ఇండియా) - HRAWI, మహారాష్ట్రలోని హోటల్స్, రెస్టారెంట్ల అనుబంధ అనుబంధేతర సంఘాలు కూడా జూలై 14 బంద్‌కు తమ మద్దతును ప్రకటించాయి.

Liquor Bandh: మహారాష్ట్రలో మందుబాబులకు ఇది బ్యాడ్ న్యూస్. అక్కడ లిక్కర్ బంద్ కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 20వేలకు పైగా బార్లు, పర్మిట్ రూమ్ లు తమ కార్యకలాపాలు మూసివేయనున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం మద్యంపై పన్నులు పెంచడాన్ని నిరసిస్తూ జూలై 14న బార్లు, పర్మిట్ రూములు బంద్ కానున్నాయి. మద్యంపై పన్నులు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని క్రూరమైనదిగా అభివర్ణించారు.
మద్యంపై వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) 10%కి పెంచడం, వార్షిక లైసెన్స్ ఫీజులో 15% పెరుగుదల, ఎక్సైజ్ సుంకంలో 60% పెరుగుదలతో సహా రాష్ట్ర ప్రభుత్వం పన్ను పెంపుదలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా బంద్ కు ఇండియన్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ (AHAR) పిలుపునిచ్చింది.
పన్నుల పెంపుదల రూ.1.5 లక్షల కోట్ల మద్యం పరిశ్రమను పతనం అంచుకు నెట్టివేస్తుందని AHAR తెలిపింది. “మహారాష్ట్రలో ఆతిథ్య రంగం ఇబ్బందుల్లో ఉంది. మా విజ్ఞప్తులను పట్టించుకోవడం లేదు. నిరసనలో భాగంగా జూలై 14న రాష్ట్రంలోని ప్రతి బార్, పర్మిట్ రూమ్‌ను మూసివేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ కఠినమైన పన్నులకు వ్యతిరేకంగా మొత్తం మహారాష్ట్ర బార్లు మూసివేయబడతాయి” అని AHAR అధ్యక్షుడు సుధాకర్ శెట్టి తెలిపారు. ఈ బార్లు, పర్మిట్ రూముల్లో జూలై 14న మద్యం విక్రయాలు ఉండవు. ముంబై, పూణే, నాసిక్, నాగ్‌పూర్, కొంకణ్ లో బంద్‌లో పాల్గొంటున్నారు.
Also Read: మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు.. 16లక్షల విలువైన పెళ్లి ఆభరణాలు.. వెనక్కి ఇచ్చేసిన సోనమ్ కుటుంబం..
నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI), హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ (వెస్ట్రన్ ఇండియా) – HRAWI, మహారాష్ట్రలోని హోటల్స్, రెస్టారెంట్ల అనుబంధ అనుబంధేతర సంఘాలు కూడా జూలై 14 బంద్‌కు తమ మద్దతును ప్రకటించాయి.
పన్నుల పెంపు చర్య వేలాది చిన్న మధ్య తరహా వ్యాపారాలను తుడిచిపెట్టడమే కాకుండా, సామూహిక నిరుద్యోగానికి, పొరుగు రాష్ట్రాల నుండి మద్యం అక్రమ రవాణాలో బ్లాక్ మార్కెట్ పెరుగుదలకు దారితీస్తుందని AHAR ఆందోళన వ్యక్తం చేసింది. ”పన్నుల పెంపుతో మా మనుగడ ప్రమాదంలో ఉంది. ప్రభుత్వం ఈ పెంపులను వెనక్కి తీసుకోకపోతే ఆతిథ్య రంగానికి కోలుకోలేని నష్టం జరుగుతుందని మేము భయపడుతున్నాము” అని AHAR చెప్పింది.
“ఇప్పటికే నష్టాల్లో ఉన్న మా వ్యాపారం.. పన్నుల పెంపుతో మరింత దెబ్బతింటుంది. ప్రభుత్వ నిర్ణయం వినియోగదారులు, ఆపరేటర్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది” అని HRAWI అధ్యక్షుడు జిమ్మీ షా ఆందోళన వ్యక్తం చేశారు.