మోడీ చమత్కారం…స్పీడ్ బ్రేకర్ దీదీ

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వెస్ట్ బెంగాల్ లో బుధవారం(ఏప్రిల్-3,2019) ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై మోడీ తీవ్ర విమర్శలు చేశారు.అభివృద్ధికి మమత స్పీడ్ బ్రేకర్ అని మోడీ అన్నారు.మమత పాలనలో చిట్‌ఫండ్ కేసులు ఎక్కువయ్యాయని మోడీ ఆరోపించారు.
నార్త్ బెంగాల్ లోని సిలిగురిలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోడీ మాట్లాడుతూ….వెస్ట్ బెంగాల్ లో ఓ స్పీడ్ బ్రేకర్ ఉంది.ఆ స్పీడ్ బ్రేకర్ ను దీదీ అంటారు. మీ అభివృద్ధికి ఈ స్పీడ్ బ్రేకరే అవరోధంగా మారిందని ర్యాలీలోని ప్రజలనుద్దేశించి మోడీ అన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ స్కీమ్ నుంచి కూడా బెంగాల్ తప్పుకోవడాన్ని మోడీ తప్పుపట్టారు. ఆయుష్మాన్ భారత్‌కు దీదీ బ్రేకేశారని మోడీ అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం మమతా మరింత పనిచేయాల్సి అవసరం ఉందన్నారు.