రాజకీయ చిచ్చు : స్టాలిన్ సవాల్

  • Published By: madhu ,Published On : May 15, 2019 / 08:22 AM IST
రాజకీయ చిచ్చు : స్టాలిన్ సవాల్

Updated On : May 15, 2019 / 8:22 AM IST

బీజేపీపై డీఎంకె ఛీప్ స్టాలిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ తాము టచ్‌లో ఉన్నట్లు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసానికి సిద్ధమని..వారు సిద్ధమా అని సవాల్ విసిరారు. కేసీఆర్ – స్టాలిన్ భేటీ అనంతరం తమిళ రాజకీయాల్లో డీఎంకే ఏటువైపు అనే విషయంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. అన్నాడీఎంకే ఏకంగా డీఎంకేపై నిప్పులు కక్కుతుండగా బీజేపీ రాష్ట్ర అద్యక్షురాలు తమిళిసై వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోసేలా చేశాయి.

డీఎంకే..బీజేపీతో టచ్‌లో ఉందని ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. డీఎంకే పదవులకు, డబ్బులకు దిగజారే పార్టీ అన్నాడీఎంకే విమర్శలు గుప్పించింది. ధీటుగా డీఎంకే అటు అధికార అన్నాడీఎంకేపై, బీజేపీపై నిప్పులు చెరిగింది. ఒట్టాపిడారం ఎన్నికల సభలో స్టాలిన్ బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోడి, తమిళిసైలకు దమ్ముంటే తన సవాల్‌కు సిద్దం కావాలని డిమాండ్ చేశారు. బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు నిరూపించాలన్నారు. నిరూపిస్తే తాను రాజకీయ సన్యాయం తీసుకుంటాను..లేకపోతే మోడీ, తమిళిసై సిద్దమా అంటూ సవాల్ విసిరారు. దీంతో బీజేపీ రాజేసిన రాజకీయ చిచ్చు ఇప్పుడు తమిళనాట దుమారం రేపుతోంది.