మండ్యా నుంచే బరిలోకి! : రాజకీయాల్లోకి సుమలత

కర్ణాటక : దివంగత కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ భార్య సుమలత పొలిటికల్ ఎంట్రీకి అంతా సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన భర్త అంబరీష్ ప్రాతినిధ్యం వహించిన మండ్యా నుంచే రాబోయో సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఎంపీగా బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది. అంబరీష్ సంస్మరణ సభకు పార్టీలకు అతీతంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరవ్వగా సుమలత రాజకీయ ఎంట్రీపై వచ్చిన చర్చలో సుమలత అందుకు అంగీకారం తెలిపినట్లుగా సమాచారం. దీనికి అంబరీష్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ పెద్దయెత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వకపోతే జేడీఎస్ నుంచి గానీ..ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా గెలిపించుకుంటామని అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. సుమలత కుమారుడు, సినీ హీరో అభిషేక్ సైతం తన తల్లి ఎన్నికల్లో పోటీ చేయడం మంచిదేనన్నారట. ఇప్పటి వరకూ రాజకీయాలకు దూరంగా వున్న సుమలత పొలిటికల్ ఎంట్రీతో రాజకీయాలలో ఎలా రాణిస్తారో వేచిచూడాలి.