Supreme Court : ‘మై లార్డ్’ అనడం మానేస్తే తన జీతంలో సగం ఇస్తానన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి
కోర్టులో న్యాయవాదులు న్యాయమూర్తులను 'మై లార్డ్' లేదా 'యువర్ లార్డ్ షిప్స్' అని సంబోధిస్తారు. ప్రస్తుతం అది ఆచరణలో లేకపోయినా అలవాటు మానని న్యాయవాదులపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి పిఎస్ నరసింహ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Supreme Court
Supreme Court : కోర్టు విచారణలో న్యాయవాదులు పదే పదే ‘మై లార్డ్’ ‘యువర్ లార్డ్‌షిప్స్’ అని సంభోదించడంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి పిఎస్ నరసింహ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలా అనడం మానేస్తే తన జీతంలో సగం ఇచ్చేస్తానని సీనియర్ న్యాయవాదితో చెప్పడం ఆసక్తికరంగా మారింది.
Supreme Court: స్వలింగ వివాహాలకు చట్టబద్ధతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
తాజాగా ఓ సాధారణ కేసు విచారణ జరుగుతున్న సందర్భంలో జస్టిస్ పిఎస్.నరసింహ ‘ ‘మై లార్డ్’ అని ఎన్నిసార్లు చెబుతారు? మీరు ఇలా చెప్పడం ఆపేస్తే నా జీతంలో సగం మీకు ఇస్తాను’ అంటూ వ్యాఖ్యలు చేసారు. సీనియర్ ప్రిసైడింగ్ జడ్జి జస్టిస్ ఎఎస్ బోపన్నతో కూడిన బెంచ్‌పై కూర్చున్న జస్టిస్ పిఎస్ నరసింహ ఓ సీనియర్ న్యాయవాదితో ఈ వ్యాఖ్యలు చేసారు. మీరు ‘మై లార్డ్’ కి బదులుగా ‘సార్’ అని ఎందుకు పిలవకూడదని? అన్నారు.
Supreme Court : మహిళ గర్భ విచ్ఛిత్తిపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
కోర్టులో వాద ప్రతివాదనలు జరుగుతున్నప్పుడు న్యాయమూర్తులను న్యాయవాదులు ‘మై లార్డ్’ లేదా ‘యువర్ లార్డ్‌షిప్స్’ అని సంబోధిస్తారు. ఈ ఆచారాన్నిబానిసత్వానికి చిహ్నంగా పిలుస్తారు. 2006 లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏ న్యాయవాది న్యాయమూర్తులను అలా సంబోధించకూడదని నిర్ణయించిన తీర్మానాన్ని ఆమోదించింది. అయితే అది మాత్రం ఆచరణకు నోచుకోలేదు.