ఎవరినీ వదిలిపెట్టం : ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్
ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. పంట వ్యర్థాల దహనాలను నిలువరించడంలో అధికారులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. పంట వ్యర్థాల దహనాలను నిలువరించడంలో అధికారులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. పంట వ్యర్థాల దహనాలను నిలువరించడంలో అధికారులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శులపై సీరియస్ అయింది. ఈ విషయంలో ఎవరినీ వదిలిపెట్టేది లేదన్న కోర్టు..అధికారులను శిక్షించే సమయం ఆసన్నమైందంటూ వ్యాఖ్యలు చేసింది. ఇదేనా పద్ధతంటూ పంజాబ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిపై ఫైర్ అయ్యింది. విధి నిర్వహణలో విఫలమైనప్పుడు పదవిలో కొనసాగడం దేనికని పంజాబ్ ప్రధాన కార్యదర్శిపై విరుచుకుపడింది. పంట వ్యర్థాల దహన నియంత్రణపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.
ఢిల్లీలో పొల్యుషన్ లెవల్ 1800 స్థాయికి చేరుకుంది…పలు విమానాలను దారి మళ్లించారు.. కాలుష్యంతో జనం చస్తుంటే మీ పనిపట్ల మీరు గర్వంగా ఫీలవుతున్నారా అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. రైతులు ప్రతి సంవత్సరం పంట వ్యర్థాలను దహనం చేస్తారని తెలిసి కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలను జస్టిస్ అరుణ్ మిశ్రా ప్రశ్నించారు.
కొద్ది రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం నెలకొంది. మంగళవారం (నవంబర్ 5, 2019) ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 413 పాయింట్స్ కాగా, బుధవారం (నవంబర్ 6, 2019) నాటికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 279 పాయింట్లుగా నమోదైంది. ఢిల్లీలోని మిగితా ప్రాంతాల్లోనూ సివియర్ నుంచి పూర్ స్టేజీకి AQI తీవ్రత చేరింది.
కాగా కాలుష్య ప్రభావం స్వల్పంగా తగ్గినా పొగమంచు మాత్రం ఢిల్లీ వాసులను ఇబ్బంది పెడతోంది. ఢిల్లీ శివారు ప్రాంతాలైన గ్రేటర్ నోయిడా, గజియాబాద్ లోనూ దట్టమైన పొగ కప్పేసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.