కమల్ నాథ్ కి ఊరట…ఈసీ ఆర్డర్ పై సుప్రీం ‘స్టే’

  • Published By: venkaiahnaidu ,Published On : November 2, 2020 / 01:40 PM IST
కమల్ నాథ్ కి ఊరట…ఈసీ ఆర్డర్ పై సుప్రీం ‘స్టే’

Updated On : November 2, 2020 / 2:29 PM IST

Supreme Court stays Election Commission order removing Kamal Nath as star campaigner మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ కు సుప్రీంకోర్టు పెద్ద ఊరట లభించింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలపై స్టే విధిస్తున్నామని..ఈసీకి అధికారం లేదంటూ సీజేఐ ఎస్ ఏ బోబ్డే వ్యాఖ్యానించారు. కమల్ నాథ్ స్టార్ క్యాంపెయిన్ ను రద్దు చేస్తూ శనివారం ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంపై కమల్ నాథ్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా…ఎన్నికల కమిషన్ ఆర్డర్ పై స్టే విధించింది సుప్రీంకోర్టు.



పదే పదే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం,ఎన్నికల కమిషన్ చేసిన హెచ్చరికలను పూర్తిగా బేఖాతరు చేసిన నేపథ్యంలో కమల్ నాథ్ కి ఉన్న స్టార్ క్యాంపెయినర్ స్టేటస్ ని తొలగిస్తున్నట్లు ఎన్నికల సంఘం అక్టోబర్-30,2020న ఓ ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఒకవేళ కమల్ నాథ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే…ఆయన ప్రయాణ,బస సహా మొత్తం ఖర్చు…ఆయన ఏ నియోజకవర్గంలో అయితే క్యాంపెయిన్ చేస్తున్నారో ఆ నియోజకరవ్గంలో పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి తన ఎన్నికల ఖర్చు నుంచి భరించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది.



https://10tv.in/khap-panchayat-orders-social-boycott-of-elderly-man-for-12-years/
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు డబ్బు ఖర్చు విషయంలో పరిమితులు ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే, స్టార్ క్యాంపెయినర్ ల ఖర్చులు పరిమితులు లేని పార్టీ అకౌంట్ కు వెళ్లాయి. అయితే,ఎన్నికల సంఘం ప్రకటనపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కమల్ నాథ్ కోర్టుని ఆశ్రయించగా..ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే విధించింది.



ఈ ఏడాది మార్చిలో మధ్యప్రదేశ్ లో 22మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. బీజేపీకి జై కొట్టడంతో కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి..శివారాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ 22 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగుతున్నాయి. వాటిటోపాటు మరో ఆరుస్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా 28స్థానాలకు నవంబర్-3న ఉపఎన్నికలు జరుగనున్నాయి.