టాటా చేతికి పార్లమెంట్ భవన నిర్మాణం

Tata Projects : వందేళ్ల కిందట..నిర్మించిన పార్లమెంట్ భవన స్థానంలో కొత్త భవనం కాంట్రాక్టు టాటా చేతిలో పడింది. రూ. 861.90 కోట్లకు ఆ సంస్థ దక్కించుకుంది. ఈ కాంట్రాక్టు కోసం ఏడు సంస్థలు పోటీ పడ్డాయి. మొత్తం రూ. 899 కోట్ల విలువైంది ఈ ప్రాజెక్టు.
లార్సన్ అండ్ టుబ్రో రూ. 865 కోట్లకు బిడ్ దాఖలు చేసింది. తక్కువ ధర కోడ్ చేసిన టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కు ఈ కాంట్రాక్టు దక్కినట్లు కేంద్ర పన్నుల విభాగం తెలిపింది.
సెంట్రల్ విస్టా రీడెవలెప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంటు భవన నిర్మాణాన్ని కేంద్రం చేపట్టిన సంగతి తెలిసిందే.
ఈ నిర్మాణాన్ని 21 నెలలో పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. 2022లో 75వ స్వాంతంత్ర దినోత్సవ వేడుకలకు ముందే ప్రారంభించాలని అనుకొంటోంది. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవనం బ్రిటీష్ కాలం నాటిదని, భవిష్యత్ అవసరాలకు సరిపోదని కేంద్రం వెల్లడిస్తోంది.
దాదాపు 1,400 ఎంపీలు సౌకర్యవంతంగా ఉండే విధంగా పార్లమెంట్ భవనం ఉంటుందని, మొత్తం 65 వేల చదరపు మీటర్ విస్తీర్ణంతో గ్రౌండ్, రెండు అంతస్తులు ఉండనున్నాయి.