కశ్మీర్ యాపిల్‌ను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు

కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఉగ్రవాదులు..వారి సానుభూతి పరులు కశ్మీర్ యాపిల్ తోటలను టార్గెట్ చేశారు. యాపిల్ తోటలకు నిప్పు పెడుతున్నారు.అంతేకాదు చెట్ల నుంచి కోసి ప్యాకింగ్ చేసిన యాపిల్స్ కు కూడా నిప్పు పెడుతున్నారు. దీంతో ఉగ్రవాదులు చేస్తున్న ఈ అరాచకాలకు కశ్మీర్ లోని యాపిల్ రైతులు తీవ్ర సంక్షోభంలో పడిపోయారు. నష్టల్లో కొట్టుమిట్టాడుతున్నారు. యాపిల్ అమ్మాకాలపై కూడా తీవ్రంగా పడింది. అమ్మకాలు దెబ్బతిన్నాయి. దీంతో యాపిల్ సాగు చేసే రైతులు రోడ్డు పడ్డారు.
కాగా ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి రద్దు చేస్తూ..ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఆనాటి నుంచి పాక్ ఉగ్రవాదులు పలు విధాలుగా తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఈ క్రమంలో యాపిల్ తోటలకు..యాపిల్స్ పండ్లను నిప్పు పెడుతూ..తన శాడిజాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రధానంగా యాపిల్ తోటలపైనే ఆధారపడి జీవించే రైతులు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు.
కశ్మీర్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకే ఉగ్రవాదులు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాని యాపిల్ రైతులు భావిస్తున్నారు. వ్యాపారాల కోసం షాపులను తెరవకూడదంటూ తమకు వార్నింగ్ లు వచ్చాయని యాపిల్ తోటల వ్యాపారులు తెలిపారు.