Boy Friends:ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ కు కరోనా అంటించిన గర్ల్ ఫ్రెండ్
:కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వాలు లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నాయి. అయినా కానీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వీటిలో ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారి వల

Three Friends Were Infected
Boy Friends:కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వాలు లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నాయి. అయినా కానీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వీటిలో ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారి వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్లు ఇప్పుడు బయట పడుతున్నారు. వీటికి సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అందుకని ప్రభుత్వం ఇలాంటి వార్తల కట్టడికి ప్రయత్నిస్తోంది. అయినా ఒకటి అరా ఇలాంటి వార్తలు కలవర పెడుతూనే ఉన్నాయి. ఇప్పుడు కరోనా బాధితులకు అన్నం, నిత్యావసర వస్తువులు సరఫరా చేసిన సెకండరీ కాంటాక్ట్ పర్సన్స్ లో కరోనా లక్షణాలు బయట పడుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇండోర్ లో బయటపడ్డ కరోనా పాజిటివ్ కేసు వార్త ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాకపోతే ఇందులో ఎంతవరకు నిజముంది అనేది తేలాల్సి ఉంది.
వివరాల్లోకి వెళితే ఇండోర్ లోని లుసాడియా గ్రామానికి చెందిన ఒక యువతికి కరోనా పాజిటివ్ వచ్చింది. అప్రమత్తమైన అధికారులు ఆ యువతికి చికిత్స అందిస్తూ ఆమె ఎవరెవరితో తిరిగిందో తెలుసుకుని వారందరినీ ఐసోలేషన్ లో ఉంచారు. మొదటగా ఆమె కుటుంబ సభ్యులను, తర్వాత బాయ్ ఫ్రెండ్ కుటుంబాన్ని ఐసోలేషన్ లో ఉంచారు.
ఆ తర్వాత విచారణలో ఆ అమ్మాయికి మరో ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలియడంతో ఆ ముగ్గురు కుటుంబాల వారిని తీసుకెళ్లి ఐసోలేషన్ లో ఉంచారు అధికారులు. వారిని విచారించగా మొత్తం నలుగురు బాయ్ ఫ్రెండ్స్ లో ఒకడికి ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలుసుకున్న అధికారులు మళ్లీ అప్రమత్తమయ్యారు.
పోలీసులు అధికారులు ఇప్పుడు ఆకుటుంబాలను పట్టుకుని ఐసోలేషన్ కు తరవించే పనిలో ఉన్నారు. ఇదంతా చూస్తుంటే..ఠాగూర్ సినిమాలో చిరంజీవి చెప్పే చైన్ లింక్ లాగా ఉంది కదా.. పోలీసులు అదే భయపడుతున్నారు. ఈ చైన్ లింక్ ఎంత దాకా ఉంటుందో..వారిలో ఎంత మందికి కరోనా సోకిందోననే ఆందోళనలో ఉన్నారు.
One girl found #Corona positive in Indore, So Doctor kept her family members n her boyfriend family members in isolation. Later her 3 other boyfriends came to Dr. n their family members r also in isolation. But one boy is having 2 more girlfriends so police is searching for them.
— KRK (@kamaalrkhan) April 21, 2020