TMC Candidate Died : కరోనాతో టీఎంసీ అభ్యర్థి మృతి

పశ్చిమ బెంగాల్‌లో కరోజా కలకలం రేపుతోంది. ఖర్దాహ నియోజకవర్గ తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అభ్యర్థి కాజల్‌ సిన్హా కరోనాతో మృతి చెందారు.

TMC Candidate Died : కరోనాతో టీఎంసీ అభ్యర్థి మృతి

Tmc Candidate Died

Updated On : April 25, 2021 / 1:51 PM IST

TMC candidate dies with Corona : పశ్చిమ బెంగాల్‌లో కరోజా కలకలం రేపుతోంది. ఖర్దాహ నియోజకవర్గ తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అభ్యర్థి కాజల్‌ సిన్హా కరోనాతో మృతి చెందారు. ఇటీవల కరోనా బారినపడ్డ ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఈ నెల 21న కోల్‌కతాలోని బెలెఘాటా ఐడీ హాస్పిటల్‌లో చేర్పించారు. ఈ నెల 23న పరిస్థితి మరింత విషమించింది. మూడు రోజులుగా వెంటిలేషన్‌పై ఉంచగా ఇవాళ ఉదయం 9.45 గంటల ప్రాంతంలో ఆయన మృతి చెందారు.

కరోనా బారినపడి సాధారణ జనంతో పాటు ప్రముఖులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే బెంగాల్‌ ఎన్నికల బరిలో ఉన్న పలువురు అభ్యర్థులు కరోనా బారిన పడ్డారు. ఇంతకుముందు ముర్షిదాబాద్‌లోని షంషేర్‌గంజ్‌, జంగిపూర్‌ నియోజకవర్గాల అభ్యర్థులు మృతి చెందగా.. ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఖర్దాడా నియోజకవర్గంలో ఆరు విడుతలో భాగంగా ఈ నెల 22న ఎన్నికలు జరిగాయి.

కాజల్‌ సిన్హా మృతిపై బెంగాల్‌ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణంతో షాక్‌కు గురయ్యానని, ప్రజాసేవ కోసం ఎంతో కృషి చేశారన్నారు. ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటించారు.