Omicron In India : భారత్ లో మరో రెండు ఒమిక్రాన్ కేసులు గుర్తింపు

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దేశంలో పలు ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా భారత్ లో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

Omicron In India : భారత్ లో మరో రెండు ఒమిక్రాన్ కేసులు గుర్తింపు

Omicron (1)

Updated On : December 10, 2021 / 5:17 PM IST

Two more Omicron cases : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇటీవలే ఒమిక్రాన్ కొత్త వేరియంట్ భారత్ లోకి ప్రవేశించింది. దేశంలో పలు ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా భారత్ లో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్ లోని జామ్ నగర్ లో మరో రెండు పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇటీవలే జింబాబ్వే నుంచి భారత్ కు వచ్చిన ఎన్ ఆర్ఐలో ఒమిక్రాన్ వెలుగుచూసింది.

ఇప్పుడు అతని భార్య, బావమరిదికి కూడా కొత్త వేరియంట్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు జామ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. ఈ రెండు కొత్త కేసులతో గుజరాత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మూడుకు చేరగా, దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 25కు చేరింది. వారం రోజుల క్రితం జింబాబ్వే నుంచి 72 ఏళ్ల ఎన్ ఆర్ఐ గుజరాత్ లోని జామ్ నగర్ కు రాగా ఆయనలో కొత్త వేరియంట్ సోకినట్లు తెలిసింది.

Bipin Rawat : బిపిన్‌ రావత్‌ జీవితాన్నే మార్చేసిన ‘అగ్గిపెట్టె’ సమాధానం

ఆ మరుసటి రోజు అతని భార్యతోపాటు బావమరిదికి పరీక్షలు నిర్వహించారు. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం వారి శాంపిల్స్ గాంధీనగర్ లోని గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ కు తరలించారు. ఆ ఇద్దరిలోనూ ఒమిక్రాన్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో వారిని జామ్ నగర్ లోని గురుగోవింద్ సింగ్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఒమిక్రాన్ వార్డుకు తరలించినట్లు అధికారులు తెలిపారు.

కాగా ముంబయిలో ఒమిక్రాన్ సోకిన తొలి వ్యక్తి పూర్తిగా కోలుకున్నారు. బుధవారం ముంబయిలోని సెవెన్ హిల్స్ ఆస్పత్రి నుంచి అతడు డిశ్చార్జ్ అయ్యారు. అంతకముందు అతనికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ గా నిర్ధారణ అయింది. మరోవైపు ముంబయిలో ఒమిక్రాన్ సోకిన రెండో వ్యక్తి కూడా కోలుకుంటున్నారు. ఆ వ్యక్తి కూడా తర్వలోనే డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లి పోతారని డాక్టర్లు చెప్పారు.

Chandrababu : అమర జవాన్ సాయితేజ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలి : చంద్రబాబు

ఇక ముంబయిలో కొత్తగా ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదు. దీంతో నగరంలో కొత్త వేరియంట్ సోకిన వారి సంఖ్య పది మాత్రమే. ఇదే విషయాన్ని ముంబయి అడిషనల్ మున్సిపల్ కమిషనర్ సురేష్ కకానీ ధృవీకరించారు.