Encounter‌ : జమ్మూలో ఉగ్రవేట.. ఇద్దరు హతం

భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరి నుంచి భారీస్థాయిలో మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.

Encounter‌ : జమ్మూలో ఉగ్రవేట.. ఇద్దరు హతం

Encounter

Updated On : September 26, 2021 / 3:35 PM IST

Encounter‌ : ఉగ్రవాదులు ఉన్నారని పక్కాసమాచారం రావడంతో జమ్మూ కాశ్మీర్ లోని బందిపోరాలో పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చేపట్టారు. గాలింపు జరుగుతున్న సమయంలోనే భద్రత దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతాబలగాలు ఎదురు కాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక మృతి చెందిన ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందినవారనే విషయం తెలియరాలేదని బందిపోరా పోలీసులు తెలిపారు. బందిపోరాలో ఉగ్రవేట కొనసాగుతోందని తెలిపారు. కాగా గడిచిన వారం రోజుల్లో 5గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతా దళాలు. వీరి నుంచి పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

 Boat Capsizes : పడవ బోల్తా..ఒకరు మృతి,పలువురు గల్లంతు

మరోవైపు సరిహద్దు వెంట 40 మంది ఉగ్రవాదులు నక్కి ఉన్నారని నిఘా వర్గాల హెచ్చరికలతో దేశ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చేపడుతున్నారు. అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. ఇక స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సరిహద్దులను జల్లెడ పడుతున్నాయి.