Farm Laws Withdrawl : వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకి కేబినెట్ ఆమోదం అప్పుడే!

గతేడాది కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రైతుల ఆందోళన నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో

Farm Laws Withdrawl : వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకి కేబినెట్ ఆమోదం అప్పుడే!

Cabinet

Updated On : November 21, 2021 / 6:49 PM IST

Farm Laws Withdrawl : గతేడాది కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రైతుల ఆందోళన నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యవసాయ చట్టాలను రద్దు చేసే అధికారిక ప్రక్రియను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.

వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లులకు బుధవారం(నవంబర్-24,2021)జరిగే సమావేశంలోనే మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించిన కొత్త బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు అధికార వర్గాల సమాచారం.

ALSO READ Farmers Protests : యథావిధిగా రైతు నిరసనలు..పలు డిమాండ్లతో మోదీకి లేఖ

.