Nirmala Sitharaman: ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. 63ఏళ్ల నిర్మల సీతారామన్ ఆస్పత్రిలోని ప్రైవేట్ వార్డులో జాయిన్ అయ్యారు.

Nirmala Sitharaman: ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

Nirmala seetaraman

Updated On : December 26, 2022 / 1:42 PM IST

Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. 63ఏళ్ల నిర్మల సీతారామన్ ఆస్పత్రిలోని ప్రైవేట్ వార్డులో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మధ్యాహ్నం 12గంటల సమయంలో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్య తలెత్తింది అనే విషయంపై స్పష్టత రాలేదు.

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఢిల్లీలో నివాళులర్పించారు. అయితే ఆమె నార్మల్ చెకప్ కోసం ఆస్పత్రిలో చేరారా, లేక ఏదైనా పెద్ద అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరారా అనేది తెలియాల్సి ఉంది.