Kishan Reddy : నా ఆఫీసులో 90 శాతంమందికి కోవిడ్-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఢిల్లీలోని తన మంత్రిత్వ శాఖ లోని కార్యాలయంలో 90 శాతం  మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని కేంద్ర పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. 

Kishan Reddy : నా ఆఫీసులో 90 శాతంమందికి కోవిడ్-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

G Kishan Reddy

Updated On : January 10, 2022 / 7:18 AM IST

Kishan Reddy :  దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఢిల్లీలోని తన మంత్రిత్వ శాఖ లోని కార్యాలయంలో 90 శాతం  మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని కేంద్ర పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.  కోవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నా జాగ్రత్తలు  పాటించాలని ఆయన సూచించారు.

Also Read : Narendra Modi : యుక్త వయస్సులో ఉన్నవారికి టీకాలు వేయటం పెంచాలి- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

హైదరాహబాద్ నారాయణగూడలో నిన్న జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…15-18 ఏళ్ల పిల్లలందరికీ టీకాలు ఇప్పించాలని తల్లితండ్రులకు విజ్ఞప్తి చేశారు. దేశంలో కోవిడ్ తీవ్రత తగ్గేంత వరకు ఉచిత బియ్యం పంపిణీ కొనసాగుతుందని ఆయన తెలిపారు.  కరోనా కేసులు పెరుగుతున్ననేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిన్న దేశంలో కోవిడ్ పరిస్ధితిపై ఉన్నతస్ధాయి సమీక్ష నిర్వహించారు. టీనేజ్ వయస్సువారందరికీ టీకా వేసే కార్యక్రమాన్ని వేగంవంతం చేయాలని చెప్పిన సంగతి పాఠకులకు తెలిసిందే.   మరోవైపు దేశవ్యాప్తంగా నేటి నుంచి బుూస్టర్ డోస్ వేయనున్నారు.