Dangerous Driving : ఇదేందయ్య ఇది!! ఆవు బైకెట్లెక్కా.. ఈ వీడియో చూస్తే ఎవ్వరికైనా దిమ్మతిరగడం ఖాయం ..

ఆవుని కూర్చోబెట్టుకుని ఓయువకుడు బైక్ రైడ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన జనం షాకవుతున్నారు.

Dangerous Driving : ఇదేందయ్య ఇది!! ఆవు బైకెట్లెక్కా.. ఈ వీడియో చూస్తే ఎవ్వరికైనా దిమ్మతిరగడం ఖాయం ..

Dangerous Driving

Updated On : November 12, 2023 / 2:23 PM IST

Dangerous Driving : బైక్ ముందు ఆవుని కూర్చోబెట్టుకుని ఓ యువకుడు డ్రైవింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు షాకయ్యారు.

Small Plane Crashes Into Car : బాబోయ్.. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టిన విమానం… వీడియో వైరల్

పెంపుడు జంతువుల్ని కార్లు, సైకిళ్ల మీద కూర్చోబెట్టుకుని జనం తీసుకెళ్లడం గురించి అందరూ చూసే ఉంటారు. కానీ ఓ ఆవుని బైక్ ముందు కూర్చోబెట్టుకుని ఓ యువకుడు బైక్ నడపడమే ఇప్పుడు జనాల్ని షాక్‌కి గురి చేసింది. @nareshbahrain అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియో నెటిజన్లను ఆందోళనకు గురి చేసింది.

ఓ యువకుడు బైక్ ముందు ఆవుని కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేస్తున్నట్లు వీడియోలో కనిపించింది. ఆవు చాలా ప్రశాంతంగా బైక్ మీద కూర్చుంది. ఆ యువకుడు చాలా కాన్ఫిడెంట్‌గా బైక్ నడుపుతున్నాడు. ఆవు మొహంలో కూడా ఎటువంటి ఆందోళన, భయం కనిపించలేదు. సోషల్ మీడియాలో షేరైన ఈ వీడియో వ్యూస్‌తో దూసుకుపోతోంది. అయితే ఆ ఆవుని బైక్ మీద కుదురుగా ఎలా కూర్చోబెట్టాడని నెటిజన్లు ఆశ్చర్యపోయారు. కొందరు ఆ ఆవుపట్ల ఆందోళన, సానుభూతి వ్యక్తం చేసారు.

Rajasthan : మహిళను 500 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. రక్షించడానికి పరుగులు తీసిన జనం.. వైరల్ వీడియో

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఉద్దేశంతో కొందరు చేసే వీడియోలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ వీడియోలో కూడా ఆవుని  బైక్ మీద కూర్చోబెట్టుకుని సరదాకి వీడియో తీసినా ఆ ఆవుని అలా బైక్‌పై ఎక్కడికి తరలిస్తున్నారని చాలామంది ప్రశ్నించారు.