AAP vs BJP: శానిటేషన్ సిబ్బందిపై బీజేపీ ఎమ్మెల్యే దాడి.. ఇది బీజేపీ వైఖరికి నిదర్శనమన్న ఆప్

శానిటేషన్ వర్కర్‌పై దాడి చేయడం బీజేపీ వైఖరికి నిదర్శనం అని ఆప్ విమర్శించింది. ఆ పార్టీ నేత రాఖీ బిర్లా మాట్లాడుతూ ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయినందుకు, నిరాశతోనే ఇలా బీజేపీ నేతలు దాడులు చేస్తున్నారని విమర్శించారు.

AAP vs BJP: శానిటేషన్ సిబ్బందిపై బీజేపీ ఎమ్మెల్యే దాడి.. ఇది బీజేపీ వైఖరికి నిదర్శనమన్న ఆప్

Updated On : December 29, 2022 / 6:43 PM IST

AAP vs BJP: ఢిల్లీలో పారిశుధ్య సిబ్బందిపై బీజేపీ ఎమ్మెల్యే దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన విషయంలో బీజేపీపై ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే అభయ్ వర్మ తాజాగా తన నియోజకవర్గ పరిధిలో తనిఖీకి వెళ్లిన సందర్బంగా, అక్కడి శానిటేషన్ వర్కర్‌ను కొట్టాడు.

Election Commission: ఎక్కడినుంచైనా ఓటేయొచ్చు.. రిమోట్ ఈవీఎం మెషీన్లు సిద్ధం చేస్తున్న ఎన్నికల సంఘం

పక్కనున్న బీజేపీ నేతలు కూడా అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శానిటేషన్ వర్కర్‌పై దాడి చేయడం బీజేపీ వైఖరికి నిదర్శనం అని ఆప్ విమర్శించింది. ఆ పార్టీ నేత రాఖీ బిర్లా మాట్లాడుతూ ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయినందుకు, నిరాశతోనే ఇలా బీజేపీ నేతలు దాడులు చేస్తున్నారని విమర్శించారు. ‘‘బీజేపీ నేతల చర్యలు వారి మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాయి. బీజేపీ దళితులకు వ్యతిరేకంగా పని చేస్తోంది. దళితుల్ని బీజేపీ ఓటు బ్యాంకుగానే చూస్తోంది’’ అని బిర్లా విమర్శించారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసుల్ని కోరాడు. పారిశుధ్య సిబ్బందిపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని, వారి భద్రతకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆప్ నేత కుల్దీప్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Riya Kumari: హైవేపై ఝార్ఖండ్ నటి కాల్చివేత.. సినీ నిర్మాత అరెస్ట్

ఈ ఘటన వీడియో వైరల్ కావడంతో సంబంధిత ఎమ్మెల్యే అభయ్ వర్మ స్పందించారు. ‘‘నేను నియోజకవర్గంలో తనిఖీకి వెళ్లాను. ఈ సందర్భంగా ఒక బస్తీలో పర్యటిస్తున్నప్పుడు అక్కడి ప్రజలు పబ్లిక్ టాయిలెట్ గురించి ఫిర్యాదు చేశారు. అది కొంతకాలంగా మూసే ఉంటోంది. దీని గురించి నేను అతడ్ని ప్రశ్నించాను. కానీ, దీనికి అతడు సరైన సమాధానం ఇవ్వకుండా అనుచితంగా మాట్లాడాడు. నేను దాడి చేయలేదు. నా సమక్షంలో కూడా దాడి జరగలేదు. టాయిలెట్ గురించి అడిగినప్పుడు ముందుగా వాటి కీ తన దగ్గర లేదన్నాడు. కానీ, స్థానికులు గట్టిగా అడగడంతో కీ తెచ్చి, ఆ టాయిలెట్స్ ఓపెన్ చేశాడు ’’ అని ఎమ్మెల్యే చెప్పాడు.