Delhi Metro : మెట్రోలో మహిళల లొల్లి.. చెప్పుతో కొడతానంటూ ఒకరిపై ఒకరు మాటల యుద్ధం

ఢిల్లీ మెట్రో అంటేనే వీడియోలకు, వివాదాలకు కేంద్ర బిందువు. తాజాగా ఇద్దరు మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చెప్పుతో కొడతానంటూ ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేశారు. వీరి గొడవకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Delhi Metro : మెట్రోలో మహిళల లొల్లి.. చెప్పుతో కొడతానంటూ ఒకరిపై ఒకరు మాటల యుద్ధం

Delhi Metro

Updated On : August 3, 2023 / 3:47 PM IST

Delhi Metro : తమ పనులతో బిజీగా వెళ్లే  ప్రయాణికులతో ఢిల్లీ మెట్రో ఒకప్పుడు రద్దీగా కనిపించేది. ప్రస్తుతం గొడవలు, కొట్లాటలకు కేంద్రంగా కనిపిస్తోంది. రీసెంట్‌గా మెట్రోలో ఇద్దరు మహిళల మధ్య జరిగిన గొడవ వైరల్ అవుతోంది.

Delhi : మెట్రోలో భిక్షాటన చేస్తున్న వ్యక్తి .. రియాక్టైన మెట్రో అధికారులు

ఢిల్లీ మెట్రోలో ఏదో ఒకటి అకస్మాత్తుగా జరిగిపోతుంది. ఒకరు డ్యాన్స్ చేస్తారు. మరో ఇద్దరు కొట్టుకుంటారు. ఇక ప్రేమ జంటలు ముద్దు పెట్టుకుంటారు. ఇంకొకరు జిమ్ చేస్తారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరి ఇష్టానుసారంగా వారు వీడియోలు తీయడం సోషల్ మీడియాలో షేర్ ఇక్కడ పనిగా మారింది. అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా లెక్క చేయట్లేదు. తాజాగా ఇద్దరు మహిళలు గొడవ పడుతున్న వీడియో వైరల్ అవుతోంది.

 

suyash_creates అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియోలో ఇద్దరు మహిళలు తీవ్రమైన పదజాలంతో ఒకరినొకరు ధూషించుకున్నారు. గొడవ ఎందుకు మొదలైందో స్పష్టంగా తెలియనప్పటికీ తీవ్రమైన గొడవ జరిగింది. ఒక దశలో వారిలో ఒక మహిళ చెప్పుతో కొడతానంటూ ఫైర్ అయ్యింది. ఈ వీడియోను ‘Delhi metro stuff part-2’ అనే ట్యాగ్‌తో షేర్ చేశారు. ఈ వీడియో ఆన్ లైన్‌లో చర్చకు దారి తీసింది. ఢిల్లీ మెట్రో ఇలాంటి గొడవలకు కేంద్రంగా మారిపోయిందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు.

Delhi Metro : ఢిల్లీ మెట్రోలో యువతుల పోల్ డ్యాన్స్ .. DMRC ఎందుకు పట్టించుకోవట్లేదంటూ నెటిజన్లు ఫైర్

‘ఈ రోజుల్లో మెట్రోలో ఏం జరుగుతోంది?’ అని,, మహిళల్లో ఒకరి పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ‘ఈ మహిళకు తక్షణ వైద్యం సహాయం చేయాలి’ అంటూ కామెంట్లు పెట్టారు.

 

View this post on Instagram

 

A post shared by Suyash Chaudhary (@suyash_creates)