వేదాంత ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత : ఇద్దరు ఆందోళనకారుల మృతి

  • Published By: madhu ,Published On : March 18, 2019 / 04:40 PM IST
వేదాంత ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత : ఇద్దరు ఆందోళనకారుల మృతి

ఒడిషా రాష్ట్రంలో తీవ్ర టెన్షన్ నెలకొంది. కల్హండిలో ఉన్న వేదాంత అల్యూమినియం ప్లాంట్ ఎదుట ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు లాఠీఛార్జీ జరిపారు. ఇద్దరు ఆందోళనకారులు మృతి చెందారు. తీవ్ర ఆగ్రహానికి గురై పోలీసులపైకి కర్రలతో దాడికి దిగారు. 

వేదాంత ప్రాజెక్టులో భాగంగా యాజమాన్యం భూ సేకరణ జరిపింది. తమకు జాబ్స్ కల్పించాలని, కాలుష్యం అధికం కాకుండా చూడాలని అక్కడి గిరిజనులు కోరుతున్నారు. మార్చి 18వ తేదీ సోమవారం గిరిజనులు కంపెనీ ఎదుట ఆందోళన చేపట్టారు. శాంతియుతంగా ఈ ఆందోళన జరుగుతోంది. అయితే కొంతమంది విధ్వంసానికి పాల్పడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జీ జరిపారు. ఇందులో ఇద్దరు ఆందోళనకారులు మృతి చెందారు. కంపెనీ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.