వయోలిన్ విద్వాంసుడు టీఎన్ కృష్ణన్ కన్నుమూత…ప్రధాని సంతాపం

  • Published By: venkaiahnaidu ,Published On : November 3, 2020 / 10:44 AM IST
వయోలిన్ విద్వాంసుడు టీఎన్ కృష్ణన్ కన్నుమూత…ప్రధాని సంతాపం

Updated On : November 3, 2020 / 11:28 AM IST

Violin maestro TN Krishnan passes away ప్రముఖ వయోలిన్ విధ్వాంసుడు టీఎన్ కృష్ణన్ (92)కన్నుమూశారు. సోమవారం రాత్రి చెన్నైలో ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణన్ పూర్తి పేరు త్రిపునితుర నారాయణాయ్యర్ కృష్ణన్. అక్టోబర్-6,1939లో కేరళలో జన్మించిన టీఎన్ కృష్ణన్..ఆ తర్వాత చెన్నైలో స్థిరపడ్డారు. ఆయన తల్లిదండ్రులు నారాయణి అయ్యర్, అమ్మాని అమ్మల్.



చిన్నతనం నుంచే సంగీతం మీద మక్కువ పెంచుకున్నారు కృష్ణన్. 1939 లో తిరువనంతపురంలో ఆయనకు 11 ఏళ్లలోనే సొంతంగా కచేరి నిర్వహించారు. కర్నాటక సంగీతంలో నిపుణుడైన ఆయన.. వయోలిన్ వాయించడంలోనూ మేటి. అలెప్పీ లో ప్రముఖ సంగీత విధ్వాంసుడు కె. పార్థసారథి వద్ద ఆయన సంగీతం నేర్చుకున్నారు. అనంతరం సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ వద్ద చేరారు.



1942 లో చెన్నైకి మకాం మార్చిన ఆయన.. వయోలిన్ విధ్వాంసకారుడిగానే గాక ఉఫాధ్యాయుడిగానూ రాణించారు. చెన్నైలోని మ్యూజిక్ కాలేజీలో సంగీత అధ్యాపకుడిగా పనిచేశారు. ఆనతికాలంలోనే ఢిల్లీ యూనివర్శిటీ,స్కూల్ ఆఫ్ మ్యాజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ కు డీన్ అయ్యారు. విద్యార్థులతో పాటు ఆయన సంతానానికి కూడా కృష్ణన్ సంగీత పాటాలు నేర్పారు. ఆయన శిష్యుల్లో కృష్ణన్ కూతురు, కొడుకు కూడా ఉండటం గమనార్హం.



కృష్ణన్ సంగీతంలో చేసిన సేవలకు గానూ ఆయనను పలు అవార్డులు వరించాయి. 1974 లో ఆయనకు సంగీత్ నాటక్ అకాడెమీ అవార్డు వరించింది. 2006 లో సంగీత్ నాటక అకాడెమీలో ఫెలోషిప్ కూడా పొందారు. 1980 లో ఆయనకు ఒక సంస్థ సంగీత కళానిధి అనే బిరుదుతో సత్కరించింది. ఇక 1973లో పద్మశ్రీ, 1992 లో పద్మ భూషణ్ ఆయనను దాసోహమయ్యాయి. చెన్నైలోని ది ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ.. ఆయనకు 1999 సంవత్సరంలో సంగీత కళాశిఖామణి అవార్డు బహుకరించింది.
https://10tv.in/iafs-first-woman-officer-vijayalakshmi-ramanan-retd-dies/
కృష్ణన్ మృతి పట్ల ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కృష్ణన్ మరణం సంగీత ప్రపంచంలో పెద్ద శూన్యతను మిగిల్చింది. ఆయన యువ సంగీతకారులకు అత్యుత్తమ గురువు. ఆయన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు సంతాపం. ఓం శాంతి అంటూ మోడీ ట్వీట్ చేశారు.