#DelhiResults : అధికారం మాదే : AAP-BJP నేతల పూజలు

  • Published By: sreehari ,Published On : February 11, 2020 / 02:50 AM IST
#DelhiResults : అధికారం మాదే : AAP-BJP నేతల పూజలు

Updated On : February 11, 2020 / 2:50 AM IST

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను ఎన్నికల సిబ్బంది లెక్కించనున్నారు. మొత్తం 21 కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు అధికారులు. 2600 సిబ్బందితో ఓట్ల లెక్కింపు జరుగనుంది. నియోజకవర్గాల వారీగా 10-14 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు.

ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలకు పోటీచేసిన 672 మంది అభ్యర్థుల భవితవ్యం నేటితో తేలిపోనుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు. మధ్యాహ్నం కల్లా #DelhiResults వెల్లడయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీదే అధికారమని ఎగ్జిట్ ఫోల్స్ కూడా తేల్చేశాయి. 

ఢిల్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి కానున్న నేపథ్యంలో ఆప్ సహా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమదే విజయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఆప్ మద్దతుదారులు ఢిల్లీలోని పార్టీ కార్యాలయం ముందు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా విజయంపై విశ్వాసంతో ఉన్నట్టు తెలిపారు. గత ఐదేళ్లుగా ఢిల్లీ ప్రజల కోసం ఆప్ చేసిన పనులే విజయాన్ని తెచ్చిపెడతాయని ధీమాతో ఉన్నారు. ఢిల్లీలో ఓట్ల లెక్కింపు నేపథ్యంలో డిప్యూటీ సీఎం సిసోడియా తన ఇంట్లో పూజలు నిర్వహించారు.

మరోవైపు.. బీజేపీ ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారీ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి మంచిరోజు కాబోతోందని నమ్ముతున్నట్టు తెలిపారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. 70 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ 55 సీట్లు గెలుచుకున్న ఆశ్యర్యం అక్కర్లేదని విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ నేత విజయ్ గోయెల్ కొన్నాట్ ప్రాంతంలోని హనుమాన్ గుడిలో పూజలు నిర్వహించారు.