మోడీ..! మాకు పొగడ్తలు కాదు.. ఆర్థిక సాయం కావాలి

మోడీ..! మాకు పొగడ్తలు కాదు.. ఆర్థిక సాయం కావాలి

Updated On : April 14, 2020 / 2:26 PM IST

ఆర్థిక సాయం అందించకుండా పొగడ్తలు మాకవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కేరళ ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తోంది. ఎటువంటి ఆర్థిక సాయాన్ని ప్రకటించకుండా పొగడ్తలు మాత్రమే కురిపించిన మోడీని కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజక్ విమర్శించారు. క్లిష్టమైన పరిస్థితుల్లో సాయం అందించకుండా ప్రధాని మాట్లాడారన్నారు. రాష్ట్రాల్లో సంక్షోభం నెలకొన్న సమయంలో అధిక వడ్డీలు వసూలు చేస్తున్న బ్యాంకుల నుంచి కాపాడేదెవరన్నారు. 

‘మహమ్మారి ప్రబలుతున్న సమయంలో దేశ పౌరులంతా చక్కగా వ్యవహరిస్తున్నారని’ ప్రధాని పొగిడారు. నాకు తెలిసి రాష్ట్రాలకు కావాలసింది కేవలం పొగడ్తలు మాత్రమే కాదు ఆర్థిక సాయం కూడా. బ్యాంకులకు వెళ్లి అప్పు అడుగుతుంటే వారంతా 9శాతం వడ్డీ అని చెప్తున్నారు. దాదాపు రాష్ట్రాలన్నీ రూ.500 నుంచి రూ.1000కోట్లు అప్పులు అడిగి శాలరీల్లో కోత విధిస్తూ.. మిగిలిన డెవలప్‌మెంట్ పనులపై ఫోకస్ పెడుతున్నారు. 

కరోనా వైరస్ ను ఈ లాక్ డౌన్  పొడిగింపు అడ్డుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో మిగిలిన రాష్ట్రాల కంటే కేరళలో  పరిస్థితి వృద్ధి చెందుతుంది. ప్రతి 4రోజులకు ఓ సారి పేషెంట్లు డబల్ అవుతున్నారు. వ్యాప్తిని అడ్డుకోవడానికి లాక్ డౌన్ ఒక్కటే మార్గం. దీనిని బట్టి మనకొక పాఠం అర్థమైంది. దేశంలో టెస్టింగ్ సెంటర్లు లేకుండాపోయాయి. గడిచిన 3వారాల్లో కేంద్రం చాలా నేర్చుకుంది.

మొదటి పాఠం టెస్టింగులు చేయకుండా లాక్ డౌన్ ఉపయోగపడదని, రెండోది వలస కార్మికులకు  ఆర్థిక సాయం చేయకపోతే సొంత ఊళ్లకు వెళ్లకతప్పదని తెలుసుకున్నారు. టెస్టింగ్ అనేది ప్రధాన లోపంగా మారింది ఇండియాకి. మహాత్మాగాంధీ నేషనల్ రోజ్‌గార్ గ్రామీణ్ ఆవాస్ పథకం కింద పనిచేసేవారికి ఒక్క శాతం కూడా న్యాయం చేయలేకపోయారు. ప్రతి రిజిష్ట్రర్ అయిన కూలీకి సగం సంవత్సర జీతం అడ్వాన్స్ గా ఇవ్వాలి. లాక్ డౌన్ ఎత్తేశాక అయినా పనిదినాలను 150రోజులకు పెంచాలి. (H1 B వీసా గడువు పొడిగించే యోచనలో అగ్రరాజ్యం)

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆర్థిక సాయం తీసుకుని రాష్ట్రాలకు ఇవ్వాలి. జిల్లాల్లో వారంపాటు ఎటువంటి కొత్త కేసులు నమోదు కాకపోతేనే కేరళలో లాక్ డౌన్ నుంచి రిలాక్స్ చేస్తామని ఐజక్ అన్నారు. బుధవారం జరగబోయే క్యాబినెట్ భేలీలో తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు.