Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదానికి కారణాలు ఇవేనా? అసలేం జరిగింది..
పైలెట్ ఎర్రర్ వల్ల కూడా ప్రమాదం జరగొచ్చన్నారు. బయటి నుంచి ఎవరైనా దాన్ని కొట్టినా కూడా ఇలాంటిది జరగొచ్చని తెలిపారు.

Ahmedabad Plane Crash: గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ ఫ్లైట్ లో 242 మంది ప్రయాణిస్తున్నారు. కాగా, విమాన ప్రమాదం ఎలా జరిగింది? విమానం ఎందుకు కుప్పకూలింది? అసలేం జరిగింది? ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి? అనేది తెలియాల్సి ఉంది.
విమాన ప్రమాదానికి కారణాలకు సంబంధించి మాజీ ఐఏఎఫ్ కెప్టెన్ సురేష్ రెడ్డి షాకింగ్ విషయాలు తెలిపారు. విమాన ప్రమాదానికి మానవ పొరపాట్లు, సాంకేతిక లోపాలు, వాతావరణం, ఏటీసీ సమస్యలు ప్రధాన కారణాలుగా ఆయన చెప్పారు. పైలెట్లు లేదా సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ లోపాలు, నావిగేషన్ సమస్యల వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చన్నారు.
నిర్వహణ లోపం వల్ల విమానంలోని యంత్రాలు మొరాయించడమూ ప్రమాదానికి ఓ కారణం అన్నారు. ఇక పక్షులు ఢీకొనడం, విమానం భాగాలు విరిగిపోవడం కూడా ఈ దుర్ఘటనకు కారణం కావొచ్చన్నారు. పైలెట్ ఎర్రర్ వల్ల కూడా ప్రమాదం జరగొచ్చన్నారు. బయటి నుంచి ఎవరైనా దాన్ని కొట్టినా కూడా ఇలాంటిది జరగొచ్చని తెలిపారు. ఇంజిన్ లో ఫైర్ అని పైలెట్ చెప్పినట్టు వార్తలు వస్తున్నాయన్న సురేశ్ రెడ్డి.. బ్లాక్ బాక్స్ దొరికితేనే విమాన ప్రమాదానికి అసలు కారణం ఏంటో తెలుస్తుందన్నారు.
Also Read: ఇండియాలో డెడ్లీ ఫ్లైట్ యాక్సిడెంట్స్ ఇవే..
విమాన ప్రమాదానికి కారణాలు ఇవే..?
* రెగ్యులర్ షెడ్యూల్ మెయింటెనెన్స్ ఉంటుంది
* ఫ్లయింగ్ అవర్స్ వారీగా మెయింటెనెన్స్ ఉంటుంది
* పార్ట్స్ లైఫ్ స్పాన్ కి తగినట్టు గా కూడా మెయింటెనెన్స్
* ఎగరడానికి ముందు కూడా చాలా చెకింగ్స్ ఉంటాయి
* కూలడానికి టెక్నికల్ కారణాలు కావొచ్చు
* సరిగా మెయింటెనెన్స్ కాకపోవడం కూడా కావొచ్చు
* బర్డ్ హిట్ కూడా కావొచ్చు
* పక్షులు ఢీకొంటే కూడా ఇంజిన్ లో మంటలు వస్తాయి
* వెదర్ కండిషన్ ఎలా ఉందో కూడా చూడాలి
* క్లౌడ్స్ లోకి ఎంటరైతే కూడా ప్రమాదం
* పైలెట్ ఎర్రర్ వల్ల కూడా ప్రమాదం జరగొచ్చు
* బయటి నుంచి ఎవరైనా దాన్ని కొట్టినా కూడా ఇలాంటిది జరగొచ్చు
* పైలెట్ ఇంజిన్ లో ఫైర్ అని చెప్పినట్టు వార్తలు
* బ్లాక్ బాక్స్ దొరికితే ఆ విషయం తెలుస్తుంది.
అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన 5 నిమిషాలకే నేలకూలింది. 242 మంది ప్రయాణికులతో ఉన్న ఆ విమానం మేఘానీనగర్ లో కూలింది. ఏటీసీ ప్రకారం మధ్యాహ్నం 1.39 గంటలకు విమానం టేకాఫ్ అయ్యింది. వెంటనే ఏటీసీకి ఎమర్జెన్సీ కాల్ వెళ్లింది. ఆ వెంటనే ఏటీసీ సంప్రదించినా విమానం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఎయిర్ పోర్ట్ బయట ఫ్లైట్ కుప్పకూలింది. గాల్లోకి ఎగిరిన కాసేపటికే అది కుప్పకూలింది. విమానం కూలగానే భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.