కన్నీటితో మమతా: మోడీ హటావో.. దేశ్ బచావో నినాదాలతో ప్రసంగం

కన్నీటితో మమతా: మోడీ హటావో.. దేశ్ బచావో నినాదాలతో ప్రసంగం

తృణముల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం(ఫిబ్రవరి-13,2019) ఢిల్లీలో  సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన ధర్నాలో భావోద్వేగ ప్రసంగం చేశారు. న్యూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన కార్యక్రమంలో మమతా పాల్గొని ఇలా మాట్లాడారు. ‘భారతేదేశ ప్రస్తుత పరిస్థితి ఎమర్జెన్సీ కంటే దారుణంగా తయారైందన్నారు. డెమోక్రసీ కాస్తా నమోక్రసీ మారిందని ఎద్దేవా చేస్తూనే కంటతడి పెట్టుకున్నారు. భావోద్వేగ పూరితంగానే మోడీ హటావో.. దేశ్ బచావో అని నినాదాలు చేశారు. 

‘ఈ రోజు పార్లమెంట్‌లో మాట్లాడిన పీఎం మోడీకి పీఎంగా ఇదే ఆఖరి లోక్ సభ సమావేశం కావాలి. ప్రతి ఒక్కరూ గబ్బర్ సింగ్‌కు భయపడిపోతున్నారు. ఇక్కడ గబ్బర్ సింగ్‌లు ఇద్దరున్నారు. ఒకరు నరేంద్ర మోడీ మరొకరు బీజేపీ చీఫ్ అమిత్ షా. రాష్ట్రంలో విషయాలకి వస్తే అంతర్గతంగా గొడవలకు దిగుతామేమో కానీ, కేంద్ర స్థాయిలో పోరాటం చేయాల్సి వస్తే మేమంతా ఏకమవుతాం. దేశాన్ని కాపాడేందుకు ప్రాణాలను పణంగా పెడతా. ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నా’నని ప్రసంగించారు. 

అంతకుముందు ఇదే సభలో ప్రతిపక్ష నేతలు బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ర కేజ్రీవాల్, శరద్ యాదవ్, ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్, ఆరెల్డీ త్రిలోక్ త్యాగిలు మాట్లాడారు. త్యాగి మాట్లాడుతూ.. ‘రిమోవ్ డిక్టేటర్ షిప్, సేవ్ డెమోక్రటిక్ ర్యాలీ’ అని నినదించారు. ఎన్సీపీ ఛీఫ్ శరద్ పవార్, ఎన్సీ లీడర్ ఫరూఖ్ అబ్దుల్లా, కనిమొజీ, ఆర్జీడీ, బీజేపీ ఎంపీ శత్రుఖ్న సిన్హాలు కూడా కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. 

Also Read: దేవెగౌడ చనిపోతారు…కర్ణాటకలో దుమారం రేపిన మరో ఆడియో టేప్

Also Read: గడియారాల గొడవ : ఎమ్మెల్యే చెవిరెడ్డిపై ఈసీకి ఫిర్యాదు