యాక్సిలేటర్ కదా అని తొక్కితే : షోరూంలో కారు బీభత్సం

  • Published By: madhu ,Published On : February 25, 2019 / 03:50 AM IST
యాక్సిలేటర్ కదా అని తొక్కితే : షోరూంలో కారు బీభత్సం

Updated On : February 25, 2019 / 3:50 AM IST

యాక్సిలేటర్ కదా అని తొక్కితే ఏమవుతుంది. ఇంకేమవుతుంది వాహనం ముందుకు దూసుకెళుతుంది. సరదాగా ఓ మహిళ కారు యాక్సిలేటర్ తొక్కడంతో షోరూం అద్దాలు తునాతునకలయ్యాయి. రెండు కార్లు దెబ్బతిన్నాయి. కారు బీభత్సానికి అక్కడంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. తమకు నష్టం వాటిల్లింది..డబ్బులు చెల్లించాలంటూ షోరూం యజమాని డిమాండ్ చేస్తున్నాడంట. కారు కొనుక్కొని ఇరుక్కపోయామంటూ ఆ ఫ్యామిలీ బాధ పడుతోందంట. 

ఓ మహిళ కొత్తకారును కొనుక్కోవాలని అనుకుని మండీలో ఉన్న షోరూంకు చేరుకుంది. అక్కడ i20 ఎలైట్ కారును పరిక్షీంచింది. కారును టెస్టు చేసేందుకు కూర్చొంది. అక్కడున్న సిబ్బంది సూచనలు ఇస్తున్నారు. అంతలోనే ఆ మహిళ యాక్సిలేటర్ తొక్కడం కారు వేగంగా ముందుకు దూసుకెళ్లడం క్షణాల్లో జరిగిపోయింది. షోరూం అద్దాలను ఢీకొని బయటున్న రెండు కార్లను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. షోరూమ్‌కు రూ.4 లక్షల నష్టం వాటిల్లిందని, ఆ సొమ్మును చెల్లించాలని యజమాని డిమాండ్ చేస్తున్నారంట.