Delhi : మెట్రో రైలు కింద పడి మహిళ మృతి.. తలుపుల మధ్య చీర ఇరుక్కుపోవడంతో ఘటన

ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో ప్రమాదం జరిగింది. ట్రైన్ తలుపుల మధ్య చీర ఇరుక్కుపోయి మహిళ మృతి చెందింది. నాంగ్లోయ్ నుంచి మోహన్ నగర్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Delhi : మెట్రో రైలు కింద పడి మహిళ మృతి.. తలుపుల మధ్య చీర ఇరుక్కుపోవడంతో ఘటన

Delhi

Updated On : December 17, 2023 / 11:48 AM IST

Delhi : ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో ప్రమాదం జరిగింది. కదులుతున్న రైలు కింద పడి మహిళ మృతి చెందింది. ట్రైన్ తలుపుల మధ్య చీర ఇరుక్కుపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

Delhi Mayor Shelly Oberoi : ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ ఫేస్‌బుక్ పేజీ హ్యాక్

రీనా (35) అనే మహిళ ఇందర్‌లోక్ స్టేషన్‌లో ప్రమాదానికి గురైంది. ఆమె మెట్రో ఎక్కుతోందా? దిగుతోందా? అనే సమాచారం తెలియలేదు. కానీ ఆమె చీర ట్రైన్ తలుపుల మధ్య చిక్కుకుని కింద పడిపోయింది. దాంతో రీనాకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు ఢిల్లీ మెట్రోస్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అనూజ్ దయాళ్ చెప్పారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ జరుపుతున్నారు.

Fake voters Issue In AP : ఢిల్లీకి చేరిన ఏపీ దొంగ ఓట్ల పంచాయితీ

వెస్ట్ ఢిల్లీలోని నాంగ్లోయ్ నుంచి మోహన్ నగర్ కు రైలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు మహిళ బంధువు విక్కీ తెలిపారు. తీవ్ర గాయాలైన రీనాను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రీనా మరణించింది.  రీనా భర్త ఏడేళ్ల క్రితం చనిపోయినట్లు తెలుస్తోంది. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నట్లు బంధువులు చెబుతున్నారు.