అమేథీలో మరోసారి అబద్దాలాడిన మోడీ

  • Published By: venkaiahnaidu ,Published On : March 4, 2019 / 11:47 AM IST
అమేథీలో మరోసారి అబద్దాలాడిన మోడీ

Updated On : March 4, 2019 / 11:47 AM IST

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన అమేథీ పర్యటనలో మరోసారి అబద్దాలు చెప్పారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం(మార్చి-3,2019) అమేథీలో పర్యటించిన ప్రధాని మేడ్ ఇన్‌ అమేథీ నినాదాన్ని తాము నిజం చేశామని అన్నారు.కాంగ్రెస్ పై,రాహుల్ పై మోడీ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
Also Read : భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా పాక్‌ ఆర్మీ కాల్పులు

ఆదివారం మోడీ చేసిన విమర్శలపై సోమవారం(మార్చి-4,2019) స్సందించిన రాహుల్..2010లోనే నేను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశాను. కొన్నేళ్లుగా అక్కడ ఆయుధాలు తయారవుతున్నాయి. నిన్న మోడీ అమేథీ వచ్చి మరోసారి అబద్దాలు చెప్పారని రాహుల్ ట్వీట్ చేశారు. అమేథీ నియోజకవర్గానికి రాహుల్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
Also Read : లైట్స్ వేయవద్దంటు బీఎస్ఎఫ్ హెచ్చరికలు : చీకట్లో గుజరాత్ గ్రామాలు

ప్ర‌పంచంలోనే అధునాత‌న‌ ఏకే-203 అధునాత‌న  ఆయుధాల తయారీ కర్మాగారానికి అమేధీలో ఆదివారం మోడీ శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ…మన దళాలు.. అమేథీలో తయారైన రైఫిల్స్ ను వినియోగించనున్నాయని, ఈ పనులు 9 ఏళ్ల క్రితమే ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ  కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించలేదని, మేడ్ ఇన్‌ అమేథీ నినాదాన్ని తాము నిజం చేశామని అన్నారు.

=================