Maharashtra : టీ ఇవ్వలేదని ఆపరేషన్ ఆపేసి వెళ్లిపోయిన డాక్టర్ .. అనస్థీషియాలోనే పడున్న మహిళలు

ఓ టీ కోసం ఓ డాక్టర్  వైద్య వృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తించాడు. టీ ఇవ్వలేదనే కోపంతో ఆపరేషన్లు చేయకుండా మధ్యలోనే వెళ్లిపోయాడు.

Maharashtra : టీ ఇవ్వలేదని ఆపరేషన్ ఆపేసి వెళ్లిపోయిన డాక్టర్ .. అనస్థీషియాలోనే పడున్న మహిళలు

Updated On : November 7, 2023 / 5:33 PM IST

Maharashtra Nagpur doctor : ఓ టీ కోసం ఓ డాక్టర్  వైద్య వృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తించాడు. మహిళలకు సర్జరీ చేసేందుకు సయయంలో టీ ఇవ్వలేని మధ్యలోనే ఆపరేషన్ థియేటర్ లోంచి బయటకొచ్చేశాడు. అక్కడున్న స్టాఫ్ పై విరుచుకుపడ్డాడు. ఈ డాక్టర్ చేసిన పనికి అప్పటికే మత్తు మందు (అనస్థీషియా)ఇచ్చి పడుకోబెట్టిన మహిళలు అలాగే మత్తులోనే ఉండిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా పరిషత్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నవంబర్ (2023)3న జరిగిన ఈ విచిత్ర సంఘటన సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడానికి నలుగురు మహిళలు వచ్చారు. వారికి డాక్టర్ తేజ్ రామ్ ఆపరేషన్ చేయాల్సి ఉంది. దాని కోసం డాక్టర్ తేజ్ రామ్ అప్పటికే ఆస్పత్రికి వచ్చారు. సర్జరీ చేయడానికి వెళ్లేముందు అక్కడున్న సిబ్బందిని టీ ఇవ్వాలని అడిగాడు. ఆతరువాత ఆపరేషన్ థియేటర్‌కు వెళ్లాడు. నలుగురు మహిళలకు  అనస్థీషియా ఇచ్చారు.

తరువాత టీ కోసం వెయిట్ చేశాడు. కానీ ఎంతకూ స్టాఫ్ టీ తెచ్చివ్వలేదు. దీంతో డాక్టర్ తేజ్ కు చిర్రెత్తుకొచ్చింది. పిచ్చి కోపం వచ్చింది. అంతే ఆపరేషన్ చేసేది లేదంటూ చిందులు తొక్కుతు థియేటర్ లోంచి బయటకొచ్చేసి స్టాఫ్ పై అంతెత్తున లేచి తిట్టిపారేశాడు. అప్పటికీ కోపం తగ్గలేదు. విసవిసా నడుచుకుంటు బయటకు వెళ్లిపోయాడు. ఇదిలా ఉంటే అప్పటికే అనస్థీషియా ఇచ్చిన మహిళలు మత్తులోనే పడుండాల్సి వచ్చింది. డాక్టర్ తేజ్ రాకపోవటంతో అధికారులు మరో డాక్టర్‌ను ఏర్పాటు చేసి సర్జీరీలు కానిచ్చేశారు.డాక్టర్ చేసిన పనిపై గ్రామస్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. తమవారికి ఏమైనా జరిగితే బాధ్యత ఎవరిది.. తమ కుటుంబాల పరిస్థితి ఏంటీ అంటూ మండిపడ్డారు.

Uber : వాటే టెక్నిక్ భయ్యా..! రైడ్స్ క్యాన్సిల్ చేసి ఏడాదిలో రూ.23 లక్షలు సంపాదించిన ఉబెర్ డ్రైవర్

డాక్టర్ తేజ్ రామ్ టీ కోసం చేసిన నిర్వాకం కాస్తా ఉన్నతాధికారుల వద్దకెళ్లింది. దీనిపై జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అజయ్ దావ్లే విచారణకు ఆదేశించారు. మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నివేదిక వచ్చాక డాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కాగా ..నాగ్ పూర్ జిల్లాలోని మౌదా ఖాట్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నవంబర్ 3న మొత్తం ఎనిమిదిమంది మహిళలకు కుటుంబ నియంత్రణ సర్జరీలు చేయాల్సి ఉంది. వీరిలో ముందుగా నలుగురు మహిళలు సర్జరీలు చేసేందుకు ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లి అనస్తీషియా కూడా ఇచ్చారు. వారికి సర్జరీలు చేయాల్సిన డ్యూటీ డాక్టర్ గా తేజ్ రామ్ డ్యూటీలో ఉన్నారు. ఈక్రమంలో టీ..బిస్కెట్స్ ఇవ్వలేదని మండిపడుతు సర్జరీలు చేయకుండానే వెళ్లిపోయిన వైనం స్థానికులకు ఆగ్రహం తెప్పించింది.

కాగా అనస్తీషియా ఇచ్చిన మహిళలు నితేష్ కాంటోడే, ప్రతిమ ప్రయోద్ బరాయ్, కరష్మా శ్రీతర్ రాజు, సునీతా యోగేష్ ఝంజోడే. డాక్టర్ చేసిన నిర్వాకంపై వీరి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయటంతో స్థానికంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.