Mizoram : 78 ఏళ్ల వయస్సులో యూనిఫాం ధరించి స్కూల్ కెళుతున్న వ్యక్తి .. ఎందుకో తెలుసా..?
చదువుకోవటానికి వయస్సుతో పనిలేదని..నిరూపించారు 78 ఏళ్ల వ్యక్తి. యూనిఫాం ధరించి..చక్కగా స్కూల్ బ్యాగ్ వేసుకుని ప్రతీరోజు మూడు కిలోమీటర్ల దూరం నడిచి మరీ స్కూల్ కు వెళుతున్నారు.

78 Years Mizoram man Go to school
Mizoram 78 Years man go to school : అతని వయస్సు 78 ఏళ్లు. చిన్నపిల్లాడిలో యూనిఫాం ధరించి స్కూల్ కు వెళుతున్నాడు. 3 కిలోమీటర్లు దూరం నడుచుకుంటు ప్రతీరోజు స్కూల్ కు వెళుతున్నాడు. మునిమనుమలతో ఆడుకునే వయస్సులో ఆయన స్కూల్ కు ఎందుకెళుతున్నాడంటే చదువు అంటే ఇష్టం. చిన్నతనంలో కుటుంబ పరిస్థితుల వల్ల చదువుకోలేకపోయాడు. దీంతో దాదాపు ఎనభై ఏళ్ల దగ్గరపడుతున్న వయస్సులో బడిబాట పట్టారు మిజోరంకు చెందిన 78 ఏళ్ల లాల్రింగ్‌తర అనే వ్యక్తి.
78 ఏళ్ల లాల్రింగ్ ప్రతీరోజు ఉదయాన్నే లేస్తారు. చక్కగా రెడీ అవుతారు. యూనిఫాం ధరిస్తారు. స్కూల్ బ్యాగు భుజనా తగిలించుకుని మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ కు వెళ్లి చదువుకుంటున్నారు. ఇంగ్లీషు నేర్చుకోవటానికి స్కూల్ కు వెళుతున్నానని చెబుతున్నారు లాల్రింగ్ తర. చదవుకోవటానికి వయస్సుతో పనిలేదని నిరూపిస్తున్నారు.
Bihar : రూ.2లంచం తీసుకున్న ఐదుగురు పోలీసులు,37 ఏళ్లు విచారణ, కోర్టు ఏమని తీర్పు ఇచ్చిందంటే..?
చంపై జిల్లా హ్రుయికాన్ గ్రామానికి చెందిన లాల్రింగ్‌తర చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు.దీంతో తల్లికు సహాయంగా ఉండటానికి చదువు మానేశారు. ఓ పక్క తల్లికి ఇంట్లో సహాయం చేస్తు చిన్న చిన్న పనులు చేస్తు డబ్బులు సంపాదిస్తు కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేవారు. అలా కుటుంబ బాధ్యతల కోసం చదువు మధ్యలోనే ఆపేసినా ఇప్పుడు చదువుకోవాలని ఆశపడ్డారు. మాతృభాషలో చదవడం, రాయడం వచ్చు. కుటుంబం కోసం సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. కానీ ఆయనకు ఇంగ్లీషు రాదు. దీంతో ఇంగ్లిష్ నేర్చుకోవాలనే ఆసక్తితో స్కూల్ కు వెళ్లాలని అనుకున్నారు. ఆ విషయం చెబితే అందరు నవ్వారు. ఈవయస్సులో చిన్నకుర్రాడిలా స్కూల్ కు వెళతావా… అంటూ గేలి చేశారు. ఇప్పుడు ఇంగ్లీషు నేర్చుకుని ఏం చేస్తావు. అని చులకనగా మాట్లాడారు.
కానీ ఆయన మాత్రం అవేవీ లెక్కచేయలేదు. పిల్లలతో కలసి స్కూల్ బ్యాగ్ భుజాన వేసుకుని రోజూ 3 కి.మీ. నడుచుకుంటూ వెళ్లి గవర్నమెంట్ స్కూల్ కు వెళుతున్నారు. హా అన్నట్లుగా ఆయన తొమ్మిదో తరగతి చదువుతున్నారు.
తన గురించి ఎవరు ఏమనుకున్నా ఫరవాలేదని..తనకు ఇష్టమైన చదువు కోసం ఎవరు ఏమన్నా లెక్క చేయనని నా చదువును పూర్తి చేస్తానని 10th క్లాస్ ఎగ్జామ్స్ లో మంచి మార్కులతో పాస్ అవుతానని ధీమా వ్యక్తంచేస్తున్నారు 78 ఏళ్ల లాల్రింగ్‌తర..