టీఆర్ఎస్ అభ్యర్థి కవితపై 176 మంది రైతులు పోటీ 

నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి కవితపై 176 మంది రైతులు పోటీ చేస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : April 6, 2019 / 05:18 AM IST
టీఆర్ఎస్ అభ్యర్థి కవితపై 176 మంది రైతులు పోటీ 

Updated On : April 6, 2019 / 5:18 AM IST

నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి కవితపై 176 మంది రైతులు పోటీ చేస్తున్నారు.

నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి కవితపై 176 మంది రైతులు పోటీ చేస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కవిత పోటీ చేస్తున్నారు. రైతులంతా మూకుమ్మడిగా ఎందుకు నిమినేషన్ వేయాల్సి వచ్చింది. కవితను ఓడించేందుకే రైతులు బరిలోకి దిగుతున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఎన్నికల కమిషన్ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. 
Read Also : సీఎం కేసీఆర్ కు కొత్త పాస్ పోర్టు

ఈసీ మమ్మల్ని మోసం చేసిందని రైతులు మండిపడుతున్నారు. తమకు గుర్తులు కేటాయించలేదని వాపోతున్నారు. ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. తాము నామినేషన్ వేయడం వెనుక ఏ రాజకీయ పార్టీ కుట్ర లేదన్నారు. పార్టీల ప్రలోభావాలకు లొంగవద్దని..రైతులమంతా ఏకమవ్వాలన్నారు. ఈవీఎంలపై తమకు నమ్మకం లేదన్నారు. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

పసుపుకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. వెయ్యి నామినేషన్లు వేయాలనుకున్నామని..కానీ కలెక్టరు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించి వేయనీయకుండా చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 15 వేల మద్దతు ధర ప్రకటించాలని.. లేనిఎడల రాష్ట్ర ప్రభుత్వం రూ.1500 బోనస్ ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. 
Read Also : ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ మేనిఫెస్టో