CM KCR’s visit to Peddapalli: నేడు భారీ ర్యాలీగా వెళ్ళి పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్న సీఎం కేసీఆర్
కేసీఆర్ పర్యటనలో భాగంగా శామీర్ పేట నుంచి సిద్దిపేట వరకు వందలాది కార్లు ఆయన కాన్వాయ్ లో చేరతాయి. ఇందుకు ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. సిద్దిపేట జిల్లాలోని రాజీవ్ రాహదారిపై భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 2500 కార్లు వెళ్లేందుకు ఏర్పాట్లు జరిగాయి. కేసీఆర్ ఇవాళ సాయంత్రం.. కలెక్టరేట్ ఆఫీసు ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ బహిరంగ సభ కోసం 130 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జన సమీకరణకు టీఆర్ఎస్ నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

CM KCR's visit to Peddapalli
CM KCR’s visit to Peddapalli: తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో కరీంనగర్ బైపాస్ రోడ్డు మీదుగా భారీ ర్యాలీగా వెళ్ళి మధ్యాహ్నం 3 గంటలకు పెద్దపల్లి జిల్లా చేరుకోనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ముందుగా సమీకృత కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించి, తర్వాత పెద్దబొంకూరు వద్ద 21 ఎకరాల స్థలంలో నిర్మించిన కార్యాలయాల సముదాయంలో పూజల్లో పాల్గొంటారు.
కేసీఆర్ పర్యటనలో భాగంగా శామీర్ పేట నుంచి సిద్దిపేట వరకు వందలాది కార్లు ఆయన కాన్వాయ్ లో చేరతాయి. ఇందుకు ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. సిద్దిపేట జిల్లాలోని రాజీవ్ రాహదారిపై భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 2500 కార్లు వెళ్లేందుకు ఏర్పాట్లు జరిగాయి.
ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ వెంట రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు ఉండనున్నారు. కేసీఆర్ ఇవాళ సాయంత్రం.. కలెక్టరేట్ ఆఫీసు ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ బహిరంగ సభ కోసం 130 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జన సమీకరణకు టీఆర్ఎస్ నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
India Covid-19 cases: దేశంలో 8 వేల దిగువకు వచ్చిన కరోనా కొత్త కేసులు