ECకి చంద్రబాబు లేఖ : ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు

కేంద్ర ఎన్నికల సంఘంపై ఆగ్రహంగా ఉన్న సీఎం బాబు..తన పోరును మరింత ఉధృతం చేశారు. ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఏప్రిల్ 25వ తేదీ అర్ధరాత్రి ఈ లెటర్ పంపారు. 9 పేజీల్లో అనేక అంశాలను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించేలా ఈసీ వ్యవహరించకూడదని.. చరిత్రలో ఎప్పుడూ ఎన్నికలు, ఫలితాలకు మధ్య ఆరు వారాల సమయం లేదని గుర్తు చేశారు.
Also Read : నర్సు ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేశారు : ఆదుకోవాలని KCRకు లేఖ
ఈ సమయంలో ప్రభుత్వ పథకాలను ఈసీ అడ్డుకోవడం కరెక్టు కాదన్నారు. తెలంగాణ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అన్ని కార్యక్రమాలపై రివ్యూలు చేస్తున్నా.. వారికి లేని ఎన్నికల కోడ్ ఏపీలోనే ఎందుకు అడ్డు వస్తోందని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం రాష్ట్రంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని.. అందువల్ల పోలవరం ప్రాజెక్టు, CRDAలపై సమీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మోడల్ ఆఫ్ కండక్ట్ అంటూ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం సబబు కాదన్నారు. అధికారుల బదిలీలను లేఖలో ప్రస్తావించారాయన.
ఏప్రిల్ 11 ఏపీలో ఎన్నికల తర్వాత..ఈసీ – ప్రభుత్వం మధ్య గ్యాప్ పెరిగింది. కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ కంప్లయింట్స్ చేసింది. అనంతరం ఈసీ పలు చర్యలు తీసుకుంది. అధికారులను బదిలీ చేయడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంగా చంద్రబాబు జరిపే రివ్యూ మీటింగ్‌లపై విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు లేఖతో ఈసీ మళ్లీ ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తిగా మారింది.
Also Read : లంక తగలబడుతోంది : 39 దేశాలకు వీసాల జారీ నిలిపివేసిన శ్రీలంక