మోడీకి బంధాలు లేవు..సంబంధాలు లేవు – బాబు

  • Published By: madhu ,Published On : February 10, 2019 / 09:23 AM IST
మోడీకి బంధాలు లేవు..సంబంధాలు లేవు – బాబు

విజయవాడ : కొడుకు నారా లోకేష్‌పై పీఎం మోడీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం ఘాటు పదాలతో విరుచుకపడ్డారు. మోడీకి బంధాలు..సంబంధాలే లేవు..కుటుంబ వ్యవస్థపై నమ్మకం ఉందా అంటూ ప్రశ్నించారు. గుంటూరు జిల్లాకు వచ్చిన మోడీ..బాబు కుటుంబంపై పలు వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న బాబు…మోడీ ఫ్యామిలీని ప్రస్తావించారు. 

కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలనే కోరుకొనే వ్యక్తుల్లో ఒకరినని..లోకేష్ తండ్రి అంటూ మోడీ అభివర్ణించారని పేర్కొన్నారు. అయితే..ఇక్కడ మోడీకి బంధాలు..సంబంధాలు లేవన్నారు. కుటుంబంతో గడపాలని కోరుకొనే వ్యక్తి తాను అని…కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలన్నారు. మోడీకి కుటుంబ వ్యవస్థపై నమ్మకం ఉందా ? అని ప్రశ్నించారు. మోడీకి భార్య ఉంది…ట్రిపుల్ తలాక్ చెల్లదని ఓ చట్టం తీసుకొచ్చారని గుర్తు చేశారు. మరి విడాకులు ఇవ్వకుండా ఆమెను ఎందుకు దూరంగా పెట్టారు ? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను ఐదు కోట్ల మంది అభిమానిస్తున్నారని…తన రాజకీయం మీద తన కుటుంబం ఆధారపడలేదన్నారు. ప్రజల కోసం తమ కుటుంబం పనిచేస్తోందని బాబు  మరోసారి చెప్పారు. బాబు చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించే ఛాన్స్ ఉంది.