కేసీఆర్ బెదిరింపులకు ఎవరూ భయపడరు : సీఎం చంద్రబాబు

కేసీఆర్ బెదిరింపులకు ఎవరూ భయపడరు..పిచ్చిపిచ్చిగా చేస్తే తగిన గుణపాఠం చెబుతామని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

  • Published By: veegamteam ,Published On : March 16, 2019 / 01:43 PM IST
కేసీఆర్ బెదిరింపులకు ఎవరూ భయపడరు : సీఎం చంద్రబాబు

కేసీఆర్ బెదిరింపులకు ఎవరూ భయపడరు..పిచ్చిపిచ్చిగా చేస్తే తగిన గుణపాఠం చెబుతామని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

చిత్తూరు : కేసీఆర్ బెదిరింపులకు ఎవరూ భయపడరు..పిచ్చిపిచ్చిగా చేస్తే తగిన గుణపాఠం చెబుతామని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. తెలంగాణ నుంచి మనకు రావాల్సిన రూ.5 వేల కోట్లు ఇవ్వమంటే మనపైనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లో ఏ అభివృద్ధి జరిగినా అది టీడీపీ చేసిందేనని చెప్పారు. హైదరాబాద్ ను విడిచి పెట్టి కట్టుబట్టలు, అప్పులతో అమరావతికి వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. 

అభ్యర్థుల ఎంపిక చాలా పకడ్బందీగా చేస్తున్నామని చెప్పారు. గెలుపు గుర్రాలను రంగంలోకి దింపామని చెప్పారు. టీడీపీ తొలి జాబితా పట్ల 90 శాతం మంది కార్యకర్తలు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఒకే ఆలోచనతో ఉండాలని సూచించారు. ’కార్యకర్తలు నాకు ప్రాణ సమానం..నా కుటుంబ సభ్యులకన్నా మిన్న’ అని కొనియాడారు. ప్రపంచస్థాయిలో తనకు గుర్తింపు రావడానికి కార్యకర్తలే కారణమన్నారు. కార్యకర్తల త్యాగాల ఫలితంగానే టీడీపీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. తన మీద బాంబులు వేస్తే వెంకటేశ్వరస్వామి కాపాడారని తెలిపారు. 

దేశంలో అవినీతి తక్కువ ఉండే రాష్ట్రాల్లో ఏపీ మూడోది అన్నారు. ప్రపంచంలో అవినీతి లేని రాష్ట్రంగా ఏపీ ఉండాలని ఆకాంక్షించారు. దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించామన్నారు. పెన్షన్ ను రెండు వేలకు పెంచామని తెలిపారు. పసుపు.. కుంకుమ కింద ఆడపడుచులకు రూ.10 వేలు ఇస్తున్నామని చెప్పారు. వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు పెంచామని తెలిపారు. రైతులకు రూ.24 వేల 500 కోట్ల రుణ మాఫీ చేశామని స్పష్టం చేశారు. రైతులకు పెద్దన్నగా ఉంటానని..వ్యవసాయాన్ని లాభాసాటిగా చేస్తానన్నారు చంద్రబాబు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. చంద్రన్న బీమాతో పేదలకు ఆదుకుంటున్నామని చెప్పారు. అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5 కే భోజనం పెడుతున్నామని తెలిపారు. నిరుద్యోగులకు నెలకు రూ.2 వేల భృతి ఇస్తున్నామని చెప్పారు. అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేశామన్నారు. విద్యుత్ సమస్యను అధిగమించామని తెలిపారు. ఏపీలో మౌలిక వసతులను మెరుగు పర్చామని చెప్పారు. ఏపీకి కియా మోటార్ తెచ్చామని తెలిపారు. ప్రజలపై కరెంట్ ఛార్జీల భారం మోపలేదన్నారు చంద్రబాబు. కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెట్టినా అభివృద్ధి ఆగదన్నారు. 2029 నాటికి దేశంలోనే నెంబర్ రాష్ట్రంగా ఏపీ ఉంటుందన్నారు.