ఖబడ్దార్ కేసీఆర్.. ఏపీపై దాడులు చేయలేవ్ : సీఎం చంద్రబాబు

ఖబడ్దార్ కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్ పైన దాడులు చేయలేవని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

  • Published By: veegamteam ,Published On : March 17, 2019 / 01:33 PM IST
ఖబడ్దార్ కేసీఆర్.. ఏపీపై దాడులు చేయలేవ్ : సీఎం చంద్రబాబు

ఖబడ్దార్ కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్ పైన దాడులు చేయలేవని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

తూ.గో : ఖబడ్దార్ కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్ పైన దాడులు చేయలేవని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ’కేసీఆర్ ఆకాశం నుండి ఊడిపడ్డాడా?. మీ మాదిరిగానే నా దగ్గర కూర్చొని పని చేశారు’ అని తెలిపారు. ఇప్పుడు తన మీదనే దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన దగ్గర పని చేసిన కేసీఆర్ కే అంత అహం ఉంటే..నాకెంత ఉండాలన్నారు. తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగౌరవ పర్చితే, ప్రజలను కించపర్చితే వదిలిపెట్టబోనని హెచ్చరించారు. కాకినాడలో నిర్వహించిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. 

’ఫ్యాన్ ఏపీలో ఉంది.. స్విచ్ హైదరాబాద్ లో ఉంది.. కరెంట్ ఢిల్లీ నుంచి వస్తుంది’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఢిల్లీ నుంచి కరెంట్ ఇవ్వకపోతే..కేసీఆర్ స్విచ్ వేయకపోతే..ఏపీలో ఫ్యాన్ తిరుగదు.. ఇది వాస్తవమన్నారు. ఇలాంటి పార్టీ మనకు కావాలా.. అని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గుల పార్టీ అని ఘాటుగా విమర్శించారు. విభజన హామీలు నెరవేర్చమంటే మనమీద దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ, ఐటీతో కేంద్రం దాడులు చేయిస్తోందన్నారు. మన దగ్గర సీట్లు రాని వారంతా వైసీపీలోకి వెళ్తున్నారని విమర్శించారు. కుట్రలో భాగస్వాములైన వారిని చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపు ఇచ్చారు. ఈ క్లిష్ట సమయంలో టీడీపీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమన్నారు. 

ఎన్టీఆర్ ఆశయాల కోసం పని చేస్తున్నానని తెలిపారు. 65 లక్షల మంది కుటుంబ సభ్యులు కలిగిన పార్టీ టీడీపీ…మనది విడదీయలేని కుటుంబ బాంధవ్యమన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు టీడీపీ జెండా మోస్తున్నారని కొనియాడారు. విజయాలు మనకు కొత్త కాదు…అనేక ఎన్నికల్లో గెలిచామని చెప్పారు. వందకు వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచే బాధ్యత తనదేనని చెప్పారు. కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. 

పింఛన్ ను రూ. 2 వేలకు పెంచామన్నారు. పసుపు-కుంకుమతో చెల్లెమ్మలను ఆదుకున్నామని చెప్పారు. 90 లక్షల మంది చెల్లెమ్మలు నాకు అండగా ఉన్నారని తెలిపారు. రుణమాఫీ సాధ్యం కాదన్నారని… చేసి చూపించామని తెలిపారు. రాష్ట్రంలో రెండు పంటలకు నీళ్లు ఇచ్చామన్నారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టును పూర్తి చేసి పంటలకు నీరిస్తున్నామని చెప్పారు. జూన్ లో పీలేరు ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత తనదేనని తెలిపారు. పేదరికం లేని సమాజమే లక్ష్యమన్నారు.