వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై రాజకీయాలు చేస్తున్నారు : సీఎం చంద్రబాబు

వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై రాజకీయాలు చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

  • Published By: veegamteam ,Published On : March 16, 2019 / 02:13 PM IST
వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై రాజకీయాలు చేస్తున్నారు : సీఎం చంద్రబాబు

వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై రాజకీయాలు చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

చిత్తూరు : వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై రాజకీయాలు చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మొదట గుండె పోటుతో చనిపోయారన్నారని తెలిపారు. ఉదయం 6.40 గంటలకు అవినాశ్ రెడ్డి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారని తెలిపారు. బాత్ రూంలో గుండెపోటుతో వివేకానంద రెడ్డి చనిపోయారన్నారు చంద్రబాబు. ఉదయం 7.30 గంటలకు పోలీసులు సంఘటనా స్థలానికి పోలీసులు వెళ్లారని తెలిపారు. పోలీసులు వెళ్లేసరికి అక్కడున్న బ్లడ్ ను క్లీన్ చేశారని వెల్లడించారు. బాత్ రూంలో పడివున్న డెడ్ బాడీని బెడ్ రూంలోకి తీసుకెళ్లారని తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. తలకు గుడ్డచుట్టి ఆస్పత్రికి తీసుకెళ్లారని చెప్పారు.  

గుండెపోటు వస్తే ఎవరికైనా తల నుంచి రక్తం వస్తుందా అని ప్రశ్నించారు. ఆస్పత్రికి తీసుకెళ్లే ముందు హత్య జరిగిందని మీకు తెలియదా? గుండెపోటుతో చనిపోయాడని పోలీసులను ఎందుకు నమ్మించారని అన్నారు. పోస్టుమార్టం అయ్యాక వివేకానంద రెడ్డిని హత్య చేశారని తేలిందన్నారు. వాస్తవాలను దాచిపెట్టి ..తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం లేని లేఖ సాయంత్రానికి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు.