రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమైన వైఎస్ షర్మిల.. రూట్ మ్యాప్ ఖరారు..!

కాంగ్రెస్ పార్టీ బలోపేతం, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు, ఆశావహుల దరఖాస్తుల స్వీకరణ, జిల్లాలలో పార్టీ పరిస్థితి, నూతన చేరికలు వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారు వైఎస్ షర్మిల.

రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమైన వైఎస్ షర్మిల.. రూట్ మ్యాప్ ఖరారు..!

YS Sharmila Andhra Pradesh Tour

Updated On : January 21, 2024 / 4:59 PM IST

YS Sharmila AP Tour : ఏపీసీసీ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల జిల్లాల పర్యటనకు రెడీ అవుతున్నారు. ఈ నెల 23 నుంచి 9 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించడానికి రూట్ మ్యాప్ ఖరారైంది. 23న నుంచి ఆమె పర్యటన ప్రారంభం అవుతుంది. షర్మిల పర్యటన ఇడుపుల పాయవరకు సాగుతుంది. జిల్లాల వారీగా సమన్వయ సమావేశాలు పెడతారు.

ప్రతిరోజు రెండు జిల్లాల్లో కోఆర్డినేషన్ సమావేశాలు నిర్వహించాలని తలపెట్టారు షర్మిల. కాంగ్రెస్ పార్టీ బలోపేతం, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు, ఆశావహుల దరఖాస్తుల స్వీకరణ, జిల్లాలలో పార్టీ పరిస్థితి, నూతన చేరికలు వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారు వైఎస్ షర్మిల.

ఏపీసీసీ అధ్యక్షురాలి బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ షర్మిల దూకుడు పెంచారని చెప్పొచ్చు. అప్పుడే జనాల్లోకి వెళ్లేందుకు రెడీ అయిపోయారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు షర్మిల. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు యాత్ర చేపట్టబోతున్నారు షర్మిల. అలాగే అన్ని జిల్లాల్లోనూ కోఆర్డినేషన్ సమావేశాలు నిర్వహించబోతున్నారు. దాదాపు 9 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉండబోతోంది. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి రెండు జిల్లాల సమావేశం నిర్వహించబోతున్నారు.

Also Read : వైసీపీలో భారీగా మార్పులు చేర్పులు.. సీఎం జగన్ వ్యూహం ఏంటి? మరోసారి అధికారం దక్కేనా?

ఉదయం ఒక జిల్లా, సాయంత్రం మరొక జిల్లాపై సమావేశాలు నిర్వహించబోతున్నారు. అన్ని జిల్లాలలో సమావేశాల నిర్వహణకు ప్రణాళిక రూపొందించారు షర్మిల. కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం అయిపోయిన వెంటనే యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఎన్నికలకు రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో షర్మిల దూకుడు పెంచారని చెప్పాలి. ఏపీలో పరిస్థితులు ఏంటి? నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి? జిల్లాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారు? వారి కెపాసిటీ ఏంటి? ఇలా అన్ని అంశాల గురించి తెలుసుకునేందుకు జిల్లాల వారీగా యాత్రకు రెడీ అవుతున్నారు షర్మిల.

షర్మిల పట్టుదల ఉన్న నాయకురాలు అని కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పటిష్టతకు షర్మిల నాయకత్వం పనికివస్తుందన్నారు. కాంగ్రెస్ తో చాలా మంది నేతలు టచ్ లో ఉన్నారని రఘువీరారెడ్డి చెప్పారు.

ఆహ్వానం ఫంక్షన్ హాలు నుంచి ఆంధ్రరత్నభవన్ కు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల బయలుదేరి వెళ్లారు. కాసేపట్లో ఏపీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం కానుంది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత షర్మిల అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఏపీసీసీ కీలక నేతలు మయప్పన్, క్రిష్టఫర్ తిలక్, మాజీకేంద్ర మంత్రులు పళ్లంరాజు, జేడీ శీలం, కేవీపీ రామచంద్ర రావు, రఘువీరా రెడ్డి, శైలజా నాథ్, సుంకర పద్మశ్రీ, తులసి రెడ్డి సహా పలువురు ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

Also Read : ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల.. సీఎం జగన్‌పై నిప్పులు

వైఎస్ షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటనపై కార్యవర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఏపీలో పార్టీ బలోపేతం చేసేందుకు నేతల చేరికలపై కార్యవర్గ సమావేశంలో డిస్కస్ చేయనున్నారు. మరోవైపు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆర్కేకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ షర్మిల.