మీసం మెలేసి.. సై అంటే సై.. జగన్, చంద్రబాబు మధ్య ఓ రేంజ్‌లో మాటల యుద్ధం

ఎన్నికల యుద్ధంలో ఎవరిది పైచేయి అవుతుందో కానీ, మాటల యుద్ధంలో ఎవరూ తగ్గడం లేదు. తగ్గేదేలే అంటే మీసాలు మెలేస్తున్నారు. జబ్బలు చరుస్తున్నారు. ఇటు జగన్, అటు చంద్రబాబు.. డైలాగ్ వార్ తో దుమ్ము రేపుతున్నారు.

మీసం మెలేసి.. సై అంటే సై.. జగన్, చంద్రబాబు మధ్య ఓ రేంజ్‌లో మాటల యుద్ధం

Chandrababu Vs Jagan

Chandrababu Vs Jagan : ఏపీ రాజకీయాల్లో టెంపరేచర్ పెరిగిపోతోంది. ఎన్నికలపై ఈసీ అధికారిక ప్రకటన చేయకపోయినా.. అధికార, విపక్షాలు మాత్రం ఎన్నికల యుద్ధానికి కాలు దువ్వుతున్నాయి. ఇరుపార్టీల అధినేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లు.. స్టేట్ మెంట్లు, సెటైర్లతో పొలిటికల్ పిక్చర్ రక్తి కట్టిస్తోంది. ఎన్నికల యుద్ధంలో ఎవరిది పైచేయి అవుతుందో కానీ, మాటల యుద్ధంలో ఎవరూ తగ్గడం లేదు. తగ్గేదేలే అంటే మీసాలు మెలేస్తున్నారు. జబ్బలు చరుస్తున్నారు. ఇటు జగన్, అటు చంద్రబాబు.. డైలాగ్ వార్ తో దుమ్ము రేపుతున్నారు.

మండే వేసవి ఎలా ఉంటుందోగాని.. ఏపీ రాజకీయాల్లో సెగ రోజురోజుకు ఎక్కువవుతోంది. వేసవి ఎండలను తలదన్నే రీతిలో అధికార, విపక్షాల మధ్య డైలాగ్‌ వార్‌ హీట్‌ పుట్టిస్తోంది. సవాళ్లు, ప్రతిసవాళ్లు.. తూటాల్లా పేలుతున్న మాటలతో అటు అధికార పక్షం.. ఇటు విపక్షం ఎన్నికల రణరంగానికి సిద్ధమవుతున్నాయి.

ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేయడానికి సీఎం జగన్‌ సిద్ధం సభలు నిర్వహిస్తుండగా.. ‘రా కదలిరా’ సభలతో కార్యకర్తలను కార్యోన్ముఖులు చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాకపోయినా.. రేపే ఎన్నికలు అన్నంత స్థాయిలో ఇరుపార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో సిద్ధం సభలు నిర్వహించిన జగన్‌.. ఇక జనం మధ్యకు వెళ్లేందుకు రెడీ అవుతుండగా, ఇప్పటికే ఒక దఫా రాష్ట్రాన్ని చుట్టేశారు చంద్రబాబు.. మరోవైపు యువనేత లోకేశ్‌ శంఖారావం.. జనసేనాని పవన్‌ నియోజకవర్గ పర్యటల పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మొత్తానికి ఇరు పక్షాలు క్షేత్రస్థాయి యుద్ధాన్ని మొదలుపెట్టినట్టే కనిపిస్తోంది.

విశాఖ జిల్లా భీమిలిలో సిద్ధం సభలతో సమర సంఖం పూరించిన సీఎం జగన్‌.. ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, అనంతపురం జిల్లా రాప్తాడుల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో దాదాపు వంద నియోజకవర్గాల కార్యకర్తలతో మమేకమైన ఈ సభల్లో ఎన్నికల యుద్ధానికి సిద్ధం కమ్మంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు సీఎం జగన్‌.. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. సీఎం…. 57 నెలల్లో తన ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరిస్తున్న సీఎం… చంద్రబాబు ఏం చేశారో చెప్పాలంటూ సవాల్‌ విసురుతున్నారు. అంతేకాకుండా పంచ్‌ డైలాగ్‌లతో కార్యకర్తలతో హుషారు నింపుతున్నారు. సైకిల్‌ బయట ఉండాలి… ఫ్యాన్‌ ఇంట్లో ఉండాలంటూ తన ఎన్నికల గుర్తును ప్రజలకు గుర్తు చేస్తున్నారు సీఎం జగన్‌.

Also Read : గుడివాడ వైసీపీలో కొత్త రాజకీయం.. కొడాలి నానికి వైసీపీ అధిష్టానం షాకివ్వబోతుందా?

సిద్ధం సభల్లో సీఎం జగన్‌ విసురుతున్న సవాళ్లను సీరియస్‌గా తీసుకుంటోంటి విపక్షం.. సీఎం జగన్‌ ఎన్నికల యుద్ధానికి సిద్ధమా అంటుంటే.. ముందు ఎవరి హయాంలో ఏ అభివృద్ధి జరిగిందో చర్చిద్దాం వస్తారా? అంటూ ప్రతిసవాల్‌ విసురుతోంది టీడీపీ. అభివృద్ధి ఎవరిదో.. విధ్వంసం ఎవరిదో బహిరంగంగా చర్చిద్దాం రమ్మంటూ అధికార పార్టీని రెచ్చగొడుతోంది టీడీపీ. ఫ్యాన్‌ రెక్కలు విరిచేయడానికి జనం సిద్ధంగా ఉన్నారంటూ సెటైర్లు వేస్తోంది. అటు జనసేన కూడా టీడీపీకి వెన్నుదన్నుగా నిలుస్తూ ఫ్యాన్‌ రెక్కలు విరిగితే.. విసనకర్ర ఇచ్చిన గాలి కూడా ఇవ్వదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. జగన్‌ మూడు ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తే.. విపక్షంలో ముగ్గురు ప్రధాన నేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌ మూడు వైపులా ముప్పేట దాడి చేస్తున్నారు.

Also Read : గుడివాడ వైసీపీలో కొత్త రాజకీయం.. కొడాలి నానికి వైసీపీ అధిష్టానం షాకివ్వబోతుందా?

ఇలా రెండు పార్టీలు వాడివేడి మాటలతో ఎన్నికల వేడిని రాజేస్తుండటంతో ఏపీలో ఎన్నికల మేఘాలు క్రమేపీ విస్తరిస్తున్నాయి. ఈ నెలాఖరు లేదా వచ్చేనెలారంభంలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుండటం… ఇప్పటికే సీఎం జగన్‌ తన పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ ఏ క్షణమైనా ఎన్నికలకు సిద్ధమనే సంకేతాలు పంపుతుండగా, ప్రతిపక్షం కూడా సీట్ల సర్దుబాటుపై అంతర్గతంగా ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి రెండు పార్టీలూ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. చావోరేవో తేల్చుకోవాలనే స్థాయిలో తలపడుతున్న రెండు పార్టీల అధినేతల మధ్య మాటల యుద్ధం మున్ముందు మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది.

పూర్తి వివరాలు..