ఏపీ తాత్కాలిక హైకోర్టు భవనం : ప్రారంభానికి సిద్ధం

నవ్యాంధ్ర రాజధానిలో తాత్కాలిక హైకోర్టు భవనం ప్రారంభానికి సిద్ధమైంది.

  • Published By: veegamteam ,Published On : February 2, 2019 / 06:28 PM IST
ఏపీ తాత్కాలిక హైకోర్టు భవనం : ప్రారంభానికి సిద్ధం

Updated On : February 2, 2019 / 6:28 PM IST

నవ్యాంధ్ర రాజధానిలో తాత్కాలిక హైకోర్టు భవనం ప్రారంభానికి సిద్ధమైంది.

అమరావతి : నవ్యాంధ్ర రాజధానిలో తాత్కాలిక హైకోర్టు భవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌ని సీఎం చంద్రబాబు అహ్వానించారు. రేపటి హై కోర్టు భవన ప్రారంభోత్సవానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
 
ఈ నెల 3న నేలపాడులో తాత్కాలిక హైకోర్టు భవనాన్ని ప్రారంభించేందుకు ఏపీ సర్కారు ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సుప్రీం కోర్టు సీజే జస్టిస్ రంజన్ గొగోయ్‌ని ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. తాత్కాలిక హైకోర్టు భవనాన్ని అత్యాధునిక వసతులతో నిర్మించారు. దాదాపు 2లక్షలా యాభై వేల చదరపు అడుగుల్లో.. జీ ప్లస్ 2 విధానంలో నిర్మించారు. భవిష్యత్తులో జీ ప్లస్ 5కి పెంచుకునే విధంగా ప్రీకాస్ట్ కాలమ్ ఆకృతుల్లో  తీర్చిదిద్దారు. ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనులన్నీ గోడలోపలే ఏర్పాటు చేస్తున్నారు. పేరుకి తాత్కాలిక  హైకోర్టు భవనమే అయినా… పూర్తి స్థాయి హై కోర్టు నిర్వహణకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ఇందులో సమకూర్చారు.

రాజస్తాన్ శాండ్ స్టోన్‌తో అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన ఈ భవనానికి.. ఇరు వైపులా ఉద్యాన వనాలు, విశాలమైన పార్కింగ్ ఏర్పాటు చేశారు. బిల్డింగ్ పక్కనే జీ ప్లస్5 విధానంలో 150మందికి సరిపడేలా లాయర్ల భవనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కారిడార్లలో మినహా మొత్తం ఏసీ సదుపాయం కల్పించారు. రెండు లక్షలకుపైగా  రికార్డులను భద్రపరిచేలా అధునిక స్టోరేజి సదుపాయం కూడా ఉంది. మౌళిక సదుపాయలన్నీ అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్నారు. 

మహిళా న్యాయవాదుల సంఘానికి ప్రత్యేక గదితోపాటు.. ప్రభుత్వ న్యాయవాదులకు 21 క్యాబిన్లు, సీనియర్ అడ్వకేట్లకు ప్రత్యేక భవనాలను నిర్మించారు.  సిబ్బంది కోసం ఆధునిక క్యూబికల్ ఫర్మిచర్, ఒకేసారి ఐదొందల మంది భోజనం చేసేలా 4వేల చదరపు అడుగుల్లో క్యాంటీన్ ఏర్పాటు చేశారు. కోర్టు ప్రాంగణంలోనే బ్యాంకు, తపాలా కేంద్రంతోపాటు.. లా బుక్స్ విక్రయ సదుపాయం కల్పించారు.