సమయం లేదు మిత్రమా : ఏప్రిల్ 11న ఎన్నికలు

సమయం లేదు మిత్రమా…అవును రాజకీయ నేతలకు ఏమాత్రం సమయం ఇవ్వలేదు ఎన్నికల అధికారులు. ఎవరూ ఊహించని ట్విస్టు ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏప్రిల్, మే నెలలో ఎలక్షన్స్ జరుగుతాయని అందరూ ఊహించారు. కానీ మొదటి ఫేజ్‌లోనే ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 10వ తేదీ ఆదివారం ప్రకటించింది.
మండుతున్న ఎండలకు తోడు హీటెక్కించే ప్రచారాలు షురూ కానున్నాయి. కేవలం ఎన్నికలకు కేవలం 30 రోజుల సమయం ఉంది. అయితే ఫలితాల కోసం నెల రోజులు మాత్రం ఆగాల్సి ఉంటుంది. ప్రధానంగా ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్ సభకు ఎన్నికలు జరుగున్నాయి. మొత్తంగా 175 అసెంబ్లీ స్థానాలకు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ పార్టీలు అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఏపీ, తెలంగాణలో నామినేషన్ తేదీ వివరాలు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు సింగిల్ ఫేజ్ లో జరగనున్నాయి. ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి షెడ్యూల్ తేదీలు ఇలా ఉన్నాయి. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
షెడ్యూల్ తేదీలు :
ఎన్నికల నోటిఫికేషన్ : మార్చి 18, 2019
నామినేషన్లకు చివరి తేదీ : మార్చి 25, 2019
నామినేషన్ల పరిశీలన : మార్చి 26, 2019
నామినేషన్ల ఉపసంహరణకు గడువు : మార్చి 28
పోలింగ్ తేదీ : ఏప్రిల్ 11
ఎన్నికల ఫలితాలు : మే 23, 2019