Azam Khan: రివేంజ్ అలా ఉంటుంది, ఒక్క ముక్క కూడా దొరకలేదు.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణంపై అజాం ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు

ఇందిరా గాంధీ మరణం అనంతరం, సిక్కుల ఊచకోత జరిగింది. ఇందులో కాంగ్రెస్ పార్టీదే ప్రధాన హస్తమనే ఆరోపణలు తీవ్రంగానే ఉన్నాయి. అనంతరం ఎల్‭టీటీ అంశంలో రాజీవ్ గాంధీ కలుగజేసుకున్నారు. అనంతరం ఇండో-శ్రీలంక ఒప్పందంపై సంతకం చేశారు. ఇది జరిగిన కొద్ది రోజులకే తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‭లో 21 మే 1991న ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతుండగా హత్యకు గురయ్యారు.

Azam Khan: రివేంజ్ అలా ఉంటుంది, ఒక్క ముక్క కూడా దొరకలేదు.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణంపై అజాం ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు

Azam Khan sparks controversy on Former PM Rajiv Gandhi

Updated On : May 1, 2023 / 6:36 PM IST

Azam Khan: ‘‘ఒకప్పుడు ఎక్కువ మంది ఎంపీలను కలిగి ఉన్న రాజీవ్‌గాంధీ చనిపోతే ఒక్క ముక్క కూడా కనిపించలేదంటే దేవుడి ప్రతీకారం ఎంత క్రూరమైందో అర్థం చేసుకోవచ్చు’’ అంటూ సమాజ్‭వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా సంజయ్ గాంధీ గురించి సైతం అంతే తీవ్రంగా స్పందించారు. ‘‘ఆకాశంలో ఎగుతారు కానీ, నేలకు దిగే సరికి ముక్కలుగా కనిపిస్తారు’’ అంటూ వ్యాఖ్యానించారు. రాంపూర్ మున్సిపాలిటీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తున్న సందర్భంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారాన్ని లేపాయి.

Karnataka Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఎన్ఆర్‭సీ’ వాగ్దానం.. మరో వివాదానికి తెరలేపిన బీజేపీ

ప్రచార సభలో అజాం ఖాన్ మాట్లాడుతూ ‘‘నేను ఇందిరాగాంధీ కాలం చూశాను. ఆమె తర్వాత రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆయన ప్రభుత్వంలో ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు. కానీ అతని మరణం అనంతరం శరీరంలోని ఒక్క ముక్క కూడా ఎక్కడా కనిపించలేదు. సంజయ్ గాంధీ వంటి వ్యక్తులు ఆకాశంలో ఎగురుతారు. కానీ నేలకు వచ్చేటప్పటికి ముక్కలుగా కనిపిస్తారు. కాబట్టి, ఒకసారి ప్రభుత్వం మారిన తర్వాత, ఒక పెద్ద మార్పు కనిపిస్తూ ఉంటుంది” అని అన్నారు.

WFI chief Brij Bhushan: దమ్ముంటే తనపై పోటీ చేయమంటూ ప్రియాంక గాంధీకి రెజ్లర్ బాడీ చీఫ్ బ్రిజ్ బూషణ్ సవాల్

అజాం ఖాన్ వ్యాఖ్యలు మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేశారని విమర్శకులు అంటున్నారు. ముస్లింలపై దాడులు తీవ్రమయ్యాయన్న విమర్శలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. దీనికి తోడు కొద్ది రోజుల క్రితం మాజీ ఎంపీ, మాఫియా డాన్ అతీక్ అహ్మద్ హత్య అనంతరం తనకు సైతం అలాంటి భయం ఉందంటూ అజాం ఖాన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చేసిన రెండు రోజులకు మాజీ ప్రధానమంత్రిపై పై విధంగా విరుచుకుపడ్డారు. అనంతరం బీజేపీని నేరుగా ప్రస్తావిస్తూనే విమర్శలు గుప్పించారు.

Rajasthan: ముఖ్యమంత్రి పుట్టిన రోజు కోసం వేసి హోర్డింగ్ ఎత్తుకెళ్లిన దొంగలు.. రాజస్థాన్‭లో వింత ఘటన

తన రాజకీయ జీవిత అనుభవాన్ని గురించి ప్రస్తావిస్తూ “ఇది 40-42 సంవత్సరాల రాజకీయ జీవిత అనుభవం. రోటీ ఎప్పుడు పెనం అవుతుందో ఎవరికీ తెలియదు. అధికారులు, పోలీసులు మారిపోతారు. మీ ఇంటి తలుపులు పగులగొట్టి, మిమ్మల్ని అడ్డగించిన పోలీసులు మీ ముందు నిలబడి సెల్యూట్ చేస్తారు’’ అని అన్నారు. రాంపూర్ మున్సిపాలిటీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఫాతిమా జాబీ తరపున అజాం ఖాన్ ప్రచారం చేశారు.

Chhattisgarh: ఎన్నికల ముందు బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన ట్రైబల్ బిగ్ బాస్

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ 2017లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాంపూర్ మాజీ ఎమ్మెల్యే అయిన అజాం ఖాన్ మీద 90కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ద్వేషపూరిత ప్రసంగం కేసులో ఖాన్‌కు కోర్టు మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. అనంతరం రాష్ట్ర అసెంబ్లీ సెక్రటేరియట్ అక్టోబర్‌లో ఖాన్‌ను అనర్హుడిగా ప్రకటించింది.

China: పట్టణాల్లో ఉద్యోగాల్లేవ్, వెంటనే గ్రామాలకు వెళ్లి పని చేసుకోండి.. యువతకు ప్రభుత్వం సలహా

ఇక రాజీవ్ గాంధీ మరణం ముందు పరిణామాల గురించి చర్చించుకుంటే.. ఇందిరా గాంధీ మరణం అనంతరం, సిక్కుల ఊచకోత జరిగింది. ఇందులో కాంగ్రెస్ పార్టీదే ప్రధాన హస్తమనే ఆరోపణలు తీవ్రంగానే ఉన్నాయి. అనంతరం ఎల్‭టీటీ అంశంలో రాజీవ్ గాంధీ కలుగజేసుకున్నారు. అనంతరం ఇండో-శ్రీలంక ఒప్పందంపై సంతకం చేశారు. ఇది జరిగిన కొద్ది రోజులకే తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‭లో 21 మే 1991న ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతుండగా హత్యకు గురయ్యారు. ఇక ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు సంజయ్ గాంధీ. దీనిపై విమర్శలు కూడా అనేకం ఉన్నాయి. అయితే ఈయన 23 జూన్ 1980లో విమాన ప్రమాదంలో మరణించారు.