3 రాజధానులకు వ్యతిరేకం : రైతులతో కలిసి పోరాడతాం-కన్నా లక్ష్మీనారాయణ

  • Published By: chvmurthy ,Published On : December 21, 2019 / 12:35 PM IST
3 రాజధానులకు వ్యతిరేకం : రైతులతో కలిసి పోరాడతాం-కన్నా లక్ష్మీనారాయణ

Updated On : December 21, 2019 / 12:35 PM IST

ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించే అంశాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ చెప్పారు. రాజధాని ప్రాంత రైతులతో కలిసి ఉద్యమంచేస్తామని ఆయన అన్నారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 2వేల 500 కోట్ల  రూపాయలు ఇచ్చిందని…ప్రభుత్వం మారినప్పుడల్లా  రాజధానిని మారుస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం కూడా మంచిది కాదని ఆయన హితవు పలికారు.  

రాజధాని మార్పు అంశంపై వైసీపీ ఒక్కటే నిర్ణయం తీసుకుంచే సరిపోదని…సీఎం మారినప్పుడల్లా రాజధధానిని మారుస్తారా అని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్ తీసుకున్న 3 రాజధానులు నిర్ణయం మంచిది కాదన్నారు కన్నా.సీఎం మారినప్పుడుల్లా రాజధానులు మారటం చరిత్రలో ఎక్కడా చూడలేదని….సీఎం మారితే ప్రభుత్వ విధానాలు మారిపోతాయా అని ఆయన ప్రశ్నించారు. 

బీజేపీ అభివృధ్ది వికేంద్రీ కరణ కోరుకుంది కానీ పరిపాలనా వికేంద్రీకరణ కాదని ఆయన అన్నారు .సీఎం జగన్ అభద్రతా భావంలో ఉన్నారని..అసెంబ్లీలో 151 సీట్లు బలం పెట్టుకుని ఆయన ఎందుకలా ఉన్నాడో తెలియటంలేదని… ఈవిషయాన్ని చాలా సార్లు చెప్పానని కన్నా గుర్తు చేశారు. జగన్ కు చంద్రబాబు నాయుడు మీద కోపం ఉంటే వారిద్దరూ తేల్చుకోవాలని,  మీ ఇద్దరి మధ్య ఉన్నకక్షలను  అమాయక ప్రజలపై చూపించవద్దని హితవు పలికారు.

ఎన్నికల సమయంలో వైసీపీ నాయకులు రాజధానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు చేశారని….అధికారంలోకి వచ్చి ఆర్నెల్లైనా వారిని గుర్తించి ఎందుకు చర్యలు తీసుకోలేదని కన్నా అన్నారు. ఈవిషయంలో మిమ్మల్ని ఎవరైనా అడ్డుకున్నారా లేక మీరే రాజీ పడిపోయారా అని అనుమానం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరగిందని కమిటీ చెప్పి 3 నెలలైనా అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. అవినీతి చేసిన వారిపై చర్యలు తీసుకుంటే స్వాగతిస్తాం కానీ, అవినీతి పరులను వదిలేసి అమాయక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే వ్యతిరేకిస్తామని కన్నా హెచ్చరించారు.

జగన్ సీఎంఅయ్యాక  కులాలు, మతాలు వేరు చేస్తున్నట్లు కనిపిస్తోందని కన్నా ఆరోపించారు.  ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ..కులాల పేరుతో ప్రజలకు  సొమ్ము పంచుతున్నారని…రాష్ట్ర అభివృధ్దికి సీఎం జగన్ 6 నెలల్లో చేసిందేమిటో చెప్పాలని కన్నా డిమాండ్ చేశారు.