BJP MLA Banshidhar Bhagat: పురుషుడి వద్ద ఏముంది? శివుడు పర్వతాల్లో.. విష్ణు సముద్రంలో ఉంటాడు: బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు
మహిళా సాధికారత ఎప్పటినుంచో ఉందని, అన్నింటికీ మనం మహిళలనే ఆశ్రయించాలని బీజేపీ ఉత్తరాఖండ్ నేత, ఎమ్మెల్యే బన్షీధర్ భగత్ చెప్పారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘జ్ఞానం కోసం సరస్వతీ దేవి ఆశీర్వాదం తీసుకోండి. శక్తి కోసం దుర్గా మాత ఆశీర్వాదం తీసుకోండి. సంపద కోసం లక్ష్మీ దేవతను ప్రార్థించండి. అంతేగానీ, పురుషుడి వద్ద ఏముంది? దేవదేవుడు శివుడు పర్వతాల్లో నివసిస్తాడు. విష్ణు లోతైన సముద్రంలో ఉంటాడు. మహిళా సాధికారత అనేది ఎప్పటినుంచో ఉంది’’ అని బన్షీధర్ భగత్ చెప్పారు.

BJP MLA Banshidhar Bhagat: మహిళా సాధికారత ఎప్పటినుంచో ఉందని, అన్నింటికీ మనం మహిళలనే ఆశ్రయించాలని బీజేపీ ఉత్తరాఖండ్ నేత, ఎమ్మెల్యే బన్షీధర్ భగత్ చెప్పారు. తాజాగా అంతర్జాతీయ బాలికా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘‘జ్ఞానం కోసం సరస్వతీ దేవి ఆశీర్వాదం తీసుకోండి. శక్తి కోసం దుర్గా మాత ఆశీర్వాదం తీసుకోండి. సంపద కోసం లక్ష్మీ దేవతను ప్రార్థించండి. అంతేగానీ, పురుషుడి వద్ద ఏముంది? దేవదేవుడు శివుడు పర్వతాల్లో నివసిస్తాడు. విష్ణు లోతైన సముద్రంలో ఉంటాడు. మహిళా సాధికారత అనేది ఎప్పటినుంచో ఉంది’’ అని బన్షీధర్ భగత్ చెప్పారు.
దీంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు అందరూ విస్మయానికి గురయ్యారు. శివుడు హిమాలయాల్లో చల్లని చలిలో ఉంటాడని, శివుడి తలపై పాము కూర్చుకుంటుందని, అలాగే పై నుంచి నీటి ధార పడుతుందని చెప్పారు. శివుడు, విష్ణు వంటి నిస్సహాయులు కనీసం పరస్పరం మాట్లాడుకోలేరని అన్నారు. బన్షీధర్ భగత్ కి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేం కాదు. గతంలోనూ పలుసార్లు ఇలాంటి వ్యాఖ్యలే చేసి అందరినీ ఆశ్చర్యపర్చారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..