సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఆ ప్రచారాన్ని ఖండించిన నేతలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కలిశారు.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఆ ప్రచారాన్ని ఖండించిన నేతలు

BRS MLAs Meet Telangana CM Revanth Reddy

Updated On : January 24, 2024 / 12:36 AM IST

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కలిశారు. ముఖ్యమంత్రి నివాసంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు సీఎం రేవంత్ ను కలిశారు. మర్యాదపూర్వకంగాను తామంతా సీఎంను కలిశామని, తమ నియోజకవర్గ సమస్యలపైనే ముఖ్యమంత్రి చర్చించామని, ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.

BRS MLAs Meet CM Revanth

BRS MLAs Meet CM Revanth

Also Read : రూ.3,200 కోట్లు వృథా.. మేడిగడ్డ వెనుక భారీ స్కాం.. విచారణలో మరిన్ని సంచలన విషయాలు

కాగా.. నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ను ఆయన ఇంటికి వెళ్లి కలవడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకే సీఎంను కలిశామని వారు చెబుతున్నా.. ఈ వ్యవహారం చర్చకు దారితీసింది. వీరి భేటీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యేలు స్పందించారు. సీఎం రేవంత్ తో భేటీపై మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు, సునీతా లక్ష్మారెడ్డి తీవ్రంగా ఖండించారు. సీఎంతో తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని ఆ నలుగురు ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేల భద్రత, ప్రొటోకాల్, నియోజకవర్గాలకు నిధుల కేటాయింపు అంశాలు తప్ప మరే అంశాలు తమ మధ్య చర్చకు రాలేదని స్పష్టం చేశారు ఎమ్మెల్యేలు.

BRS MLAs Met CM Revanth

BRS MLAs Met CM Revanth

Also Read : మరోసారి కేసీఆర్ కరీంనగర్‌ సెంటిమెంట్‌..! త్వరలో అక్కడ మకాం..!

తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు- ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
”తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు. ముఖ్యమంత్రిని కలవడం మర్యాదపూర్వక భేటీ మాత్రమే. రాజకీయ ఊహాగానాలకు తావులేదు. నర్సాపూర్ నియోజకవర్గ, ఎమ్మెల్యే సెక్యూరిటీ, ప్రోటోకాల్ సమస్యలపై సీఎంతో నలుగురు శాసనసభ్యులం చర్చించాం. ఇంతకు మించి ఎలాంటి చర్చలు జరగలేదు. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు. సచివాలయంలో అపాయింట్ మెంట్ కుదరక సీఎం ఇంటికి రమ్మన్నారు” అని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కోరారు.